Chiranjeevi: ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవికి ఉన్న రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటున్నాడు. అందుకే ఆయన నుంచి వచ్చిన ప్రతి మూవీ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలుస్తుంది. 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. సీనియర్ హీరోలందరికి పోటీని ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అందరిని తొక్కేస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
నిజానికి చిరంజీవికి ఎవరిని తొక్కాల్సిన అవసరమైతే లేదు అంటూ అతని అభిమానులు సైతం చిరంజీవి వైపు మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే చిరంజీవికి అప్పట్లో పోటీగా ఉన్నవారిలో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లు మాత్రమే ప్రథమ స్థానంలో ఉన్నారు. వీళ్లంతా ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన వారే కావడం వల్ల వాళ్లకి మంచి అవకాశాలైతే వచ్చాయి.
వీళ్ళు చిరంజీవితో పాటు పోటీపడి అతను ఏ దర్శకులతో అయితే సినిమాలు చేశాడో వీళ్ళు కూడా అదే దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఇక చిరంజీవికి ఒకరకంగా పోటీని ఇచ్చిన వారిలో వీళ్ళు ముగ్గురు మొదటి స్థానంలో ఉంటారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని చిరంజీవి ఎలాగు తొక్క లేడు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. చిరంజీవి తొక్కితే తొక్కించుకునే స్థాయిలో వాళ్ళు లేరు. కాబట్టి అతను వారిని తొక్క లేడు.
ఇక మిగతా హీరోలు చిరంజీవికి పోటీనే కాదు కాబట్టి వాళ్లను తొక్కాల్సిన అవసరం కూడా చిరంజీవికి లేదు. కాబట్టి అతను ఎవర్ని తొక్క లేదు అనడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ని మనం చెప్పలేము… ఇప్పటికి ఆయన నిజంగానే చాలా మందిని తొక్కేసాడు అని అనుకునేవాళ్లు ఇంకెవ్వరూ మార్చలేరు…