Komatireddy Rajagopal Reddy: వాగాడంబరం కాదు.. వాక్యాడంబరం ద్వారానే ఒక జర్నలిస్ట్ గొప్ప పేరు తెచ్చుకుంటాడు.. అప్పట్లో సీనియర్ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికాలంలో అటువంటి వాటికి ఆస్కారం లేదు.. ఎందుకంటే పాత్రికేయమనేది పూర్తిగా మారిపోయింది. కేవలం హడావిడి.. సంచలనాలకు మాత్రమే కారణమవుతోంది.
నిజాలు రాసిన పత్రికలను.. ఓపెన్ గా మాట్లాడుతున్న వ్యక్తులను నేటి కాలంలో శత్రువులుగా పరిగణిస్తున్నారు. పైగా రాజకీయ నాయకులు ఒక అడుగు ముందుకేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనివల్ల పాత్రికేయులు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు నాట రాజకీయ నాయకులకు ఎక్కువగా టార్గెట్ అవుతున్న ఒకే ఒక జర్నలిస్టు పేరు వేమూరి రాధాకృష్ణ.. సహజంగానే ఈయనలో దూకుడు ఎక్కువగా ఉంటుంది.. కొన్ని విషయాలను మొహమాటం లేకుండా రాస్తారు. అలాగని ఈయన అన్ని విషయాలలో నిప్పులాగా ఉంటారని.. స్పటికంలాగా వ్యవహరిస్తారని కాదు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి మీద.. మునుగోడు ఎమ్మెల్యే మీద ఆంధ్రజ్యోతి పత్రికలో.. ఏబీఎన్ ఛానల్ లో రాధాకృష్ణ కాస్త ఓపెన్ గా రాశారు. ఇది రాజగోపాల్ రెడ్డికి ఆగ్రహం కలిగించింది. రాజగోపాల్ రెడ్డి తన ఆగ్రహాన్ని తట్టుకోలేక అనాల్సిన మాటలు అనేశారు. వేమూరి రాధాకృష్ణకు ఓపెన్ గానే సవాల్ చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల చేతిలో ఎన్ని విమర్శలు ఎదుర్కొంటే.. అతడు అంత గొప్ప పాత్రికేయుడు అవుతాడు. ఇప్పుడు రాధాకృష్ణ కూడా అలాగే అవుతున్నారు.
రాధాకృష్ణ కొత్త పలుకులో తనను వ్యతిరేకించిన వారిని.. తనను తిట్టిన వారిని గట్టిగానే వేసుకునే రకం. ఈ వారం కొత్త పలుకులో రాధాకృష్ణ కచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని బయట పెడతారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు.. మునుగోడు స్థానం నుంచి పోటీ చేసినప్పుడు రాధాకృష్ణ తన ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు విపరీతమైన హైప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాధాకృష్ణ మీద రాజగోపాల్ రెడ్డి ఆ సానుకూలత చూపించడం లేదు. పైగా బస్తే మే సవాల్ అంటూ తొడ కొడుతున్నారు. మొత్తంగా వీరిద్దరి మధ్య వ్యవహారం ఎక్కడిదాకా దాడి తీస్తుందో తెలియదు కానీ.. ఈ ఆదివారం కొత్త పలుకులో మాత్రం కచ్చితంగా రాధాకృష్ణ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేయడం ఖాయం.