Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. థియేట్రికల్ ట్రైలర్, పాటలు చూసి కచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంత చేసుకుంది ఈ చిత్రం. కానీ భారీ హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ మాత్రం చాలా భారీగానే వచ్చాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు అన్ని భాషలకు కలిపి 140 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అయితే రెండవ రోజు మాత్రం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి అనే చెప్పాలి. హీరో యాష్ సొంత రాష్ట్రం అయినటువంటి కర్ణాటక లో కూడా నూన్ షోస్ దారుణమైన ఆక్యుపెన్సీలతో మొదలయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. నిన్న మ్యాట్నీ షోస్ నుండే వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కానీ హిందీ లో మాత్రం రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటుంటున్నాయి. ఓవరాల్ గా కమర్షియల్ గా డిజాస్టర్ వైపు ఈ చిత్రం అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన HD ప్రింట్ ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చింది. పలు వెబ్ సైట్స్ ఈ సినిమాని అప్లోడ్ చేశాయి. ఓటీటీ లో విడుదలైనప్పుడు ఎంతటి క్వాలిటీ ఉంటుందో, లీకైన ప్రింట్ కూడా అంతే క్వాలిటీ తో ఉంది. దీనిపై నిర్మాతలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాష్ అభిమానులు అయితే పోలీసులను ట్యాగ్ చేసి , దయచేసి పైరసీ లింక్స్ పై యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
అసలే ఈ చిత్రానికి విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చింది. 500 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. సినిమా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని పొందాలంటే కచ్చితంగా 600 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లు రావాలి. ఎన్ని వందల కోట్ల నష్టం వస్తుందో అని నిర్మాతలు బాధపడుతున్న ఈ సమయంలో , ఈ చిత్రం ఇలా ఆన్లైన్ లో HD క్వాలిటీ తో లీక్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. మరి ఈ లీక్ ప్రభావం మూవీ పై ఎలాంటి తీవ్రత చూపిస్తుందో చూడాలి. నిర్మాతలు కూడా ఇప్పటి వరకు ఈ లీక్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.