Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై ఏ రేంజ్ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడిచిన దశాబ్ద కాలం లో ఇలాంటి చెత్త సినిమాని ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి , విశ్లేషకుల నుండి వచ్చిన టాక్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. కానీ మొదటి నుండి భారీ హైప్ ఉన్న సినిమా కావడంతో పాటు, ఇంతటి డిజాస్టర్ టాక్ చెప్తున్నారు, అంతలా అసలు ఈ సినిమాలో ఏముందో చూద్దాం అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి కదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క నార్త్ ఇండియా నుండే ఈ చిత్రానికి 16 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ ఓపెనింగ్స్ అనేది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ రాగా , వరల్డ్ వైడ్ గా 140 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నార్త్ ఇండియా నుండి 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిన ఈ చిత్రానికి కర్ణాటక రాష్ట్రం నుండి 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ఇప్పటికీ ‘కేజీఎఫ్’ చాప్టర్ పేరు మీదనే ఉంది. ఆ చిత్రానికి దాదాపుగా 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ రాష్ట్రం నుండి నమోదైంది. కచ్చితంగా ‘టాక్సిక్’ భారీ మార్జిన్ తో ఆ రికార్డు ని కొడుతుందని అనుకున్నారు. కానీ డిజాస్టర్ టాక్ రావడం వల్ల టార్గెట్ మిస్ అయ్యింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దాదాపుగా 15 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
కేరళ లో డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయి అనే చెప్పాలి. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు కేవలం 1 కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. కేరళ తో పోలిస్తే తమిళనాడు నుండి మంచి వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందట. సాధారణంగా తమిళనాడు ప్రజలు తమ సినిమాలకు తప్ప , బయట హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ ఇవ్వడం చాలా కష్టం, అలాంటిది ఈ చిత్రానికి ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు డొమెస్టిక్ మార్కెట్ నుండి వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి మరో 40 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా 140 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. డిజాస్టర్ టాక్ వస్తేనే ఇలా ఉంది, పొరపాటున పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఏ రేంజ్ ఓపెనింగ్ వచ్చేదో మీరే ఊహించుకోండి.