Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో భారీ లెవెల్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ హైప్ భారీ గా ఉండడం వల్ల ఓపెనింగ్స్ మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి. డిజాస్టర్ టాక్ కారణంగా నేటి నుండి ఈ సినిమాకు సంబంధించిన థియేటర్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈయనకు మంచి గ్రిప్ ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ తో కొనసాగుతున్న ‘ఇరుముడి ‘ థియేటర్స్ ని సగానికి పైగా టాక్సిక్ కి వచ్చేలా చేసుకున్నాడు. ఒక డబ్బింగ్ సినిమా కోసం బాగా ఆడుతున్న మూవీ ని దిల్ రాజు తొక్కేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపుగా ‘ఇరుముడి’ కి సంబంధించిన వెయ్యి షోస్ ని ‘టాక్సిక్’ కి కేటాయించారు. అయినప్పటికీ కూడా ‘ఇరుముడి’ వసూళ్లు ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రతీ చోట హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకొని , నిన్న కూడా తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా వచ్చినప్పటికీ కూడా ‘ఇరుముడి’ సునామీ ప్రభావం తగ్గలేదు. కేవలం 5 రోజుల్లోనే 110 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , నిన్నటితో మీడియం రేంజ్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మీడియం రేంజ్ మూవీస్ లో ‘గీతా గోవిందం’ చిత్రానిదే రికార్డు.
2017 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోలు ఎన్నో సూపర్ హిట్స్ ని అందించారు కానీ , ఒక్కరు కూడా ‘గీతా గోవిందం’ కి దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు.ఇప్పుడు రవితేజ సరైన సూపర్ హిట్ కొట్టేలోపు వారం తిరగకముందే ఆ రికార్డు బద్దలైంది. ఫుల్ లో ఈ చిత్రం కచ్చితంగా 100 నుండి 150 కోట్ల రూపాయిల మధ్యలో షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని, 200 ఉన్నాయని , 200 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరుకుంటుందని అంటున్నారు. ఒక్క నైజాం ప్రాంతం నుండే 50 కోట్ల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.