Homeఎంటర్టైన్మెంట్Biggest Hits 2026: ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉన్న మూడు సినిమాలు...

Biggest Hits 2026: ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉన్న మూడు సినిమాలు ఇవే…

Biggest Hits 2026: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. వాళ్ళ క్రేజ్ వల్ల ప్రేక్షకులు తమ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందువల్లే వాళ్ళు బెస్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న వారిలో చాలామంది స్టార్ హీరోలైతే ఉన్నారు. ఇక ఈ […]

Biggest Hits 2026: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. వాళ్ళ క్రేజ్ వల్ల ప్రేక్షకులు తమ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందువల్లే వాళ్ళు బెస్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న వారిలో చాలామంది స్టార్ హీరోలైతే ఉన్నారు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి 400 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఈ సినిమా ప్రథమ స్థానంలో ఉంది… రేపు రవితేజ హీరోగా చేసిన ‘ఇరుముడి’ సినిమా సైతం భారీ విజయాన్ని దక్కించుకొని 200 కోట్లు మార్కును టచ్ చేయడానికి ముందుకు దూసుకెళ్తుంది.

కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను రాబడుతుందనేది తెలియాల్సి ఉంది…నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ప్యారడైస్ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా అఫీషియల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాబట్టి ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఎలా స్పందిస్తారు ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంప్రదించుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి నిజంగానే సక్సెస్ ఫుల్ టాక్ వస్తే మాత్రం సినిమాకి 500 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ సినిమా సైతం డిసెంబర్ 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇయర్ చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర్ వరప్రసాద్ 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక నాని గాని, ప్రభాస్ గాని ఈ రికార్డును బ్రేక్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper