Bigg Boss Telugu 10: మరో 8 రోజుల్లో ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇందులో సీరియల్స్ ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందరూ దాదాపుగా తెలిసిన వాళ్ళే, కానీ ఒక పేరు మాత్రం ఆడియన్స్ కి పెద్దగా తెలియదు, ఆ పేరే ఆదిత్ అరుణ్. ఈయన రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం లో అజయ్ అనే పాత్ర పోషించాడు. ఈ పాత్రకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఇతని ముఖాన్ని గుర్తుపట్టగలరు కానీ, పేరు ని మాత్రం గుర్తుపట్టలేరు.
అందుకే ఈ ‘బిగ్ బాస్ 10’ ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆడియన్స్ కి బాగా దగ్గరై , సినిమాల్లో మరింత బిజీ అవ్వాలనే ఆలోచనతోనే ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే అతను ఆశించినట్టుగానే అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే గట్టిగా చెప్పలేము. ఎందుకంటే ‘బిగ్ బాస్’ సీజన్స్ టైటిల్ విన్నర్స్ గా నిల్చిన వాళ్ళే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. బాగా గమనిస్తే, టైటిల్ విన్నెర్స్ ఒక్కరు కూడా ఇప్పుడు బిజీ గా లేరు. అదృష్టం కలిసి రాకుంటే ఇలాగే ఉంటుంది. మరి అరుణ్ అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీల జాబితా మరొకసారి చూస్తే, గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ, దేబ్ జాన్ మెదక్, ఆటో రామ్ ప్రసాద్ , జబర్దస్త్ పొట్టి నరేష్, యాంకర్ వర్షిణి, కృష్ణుడు (వినాయకుడు ఫేమ్), చైత్ర రాయ్. వీళ్ళతో పాటు ప్రముఖ యంగ్ హీరోయిన్ సీరత్ కపూర్ (రన్ రాజా రన్) కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయం లో చర్చలు నడుస్తున్నాయి. అదే విధంగా సౌందర్య రెడ్డి అనే మరో సీరియల్ హీరోయిన్ తో కూడా మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఇప్పటికే ‘ఝాన్సీ’ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు ఎంపికైంది. అదే విధంగా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా రోహిత్, అమన్ , రాజా కుమారి దయానా హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.