Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Raksha Bandhan: 2,439 మంది చెల్లెమ్మలతో పవన్ కళ్యాణ్ రక్షాబంధన్!

Pawan Kalyan Raksha Bandhan: 2,439 మంది చెల్లెమ్మలతో పవన్ కళ్యాణ్ రక్షాబంధన్!

Pawan Kalyan Raksha Bandhan:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు చిరకాలం గుర్తుండి పోయేలా పుట్టింటి పట్టుచీరలను అందించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో వేలాది మంది మహిళలకు అన్నగా ఆదరించి రక్షాబంధన్ నాడు పట్టుచీరలతో పాటు నూలు చీరలను అందించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు. సాధారణంగా రక్షాబంధన్ వస్తే రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొంతమంది వచ్చి రాఖీ కడుతుంటారు. కానీ […]

Pawan Kalyan Raksha Bandhan:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు చిరకాలం గుర్తుండి పోయేలా పుట్టింటి పట్టుచీరలను అందించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో వేలాది మంది మహిళలకు అన్నగా ఆదరించి రక్షాబంధన్ నాడు పట్టుచీరలతో పాటు నూలు చీరలను అందించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు. సాధారణంగా రక్షాబంధన్ వస్తే రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొంతమంది వచ్చి రాఖీ కడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వినూత్నంగా తన నియోజకవర్గంలో ఒంటరి ఆడపడుచులకు చీరలు అందించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.. దీంతో ఆడపడుచుల కళ్ళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.

* ఏం చేసినా ప్రత్యేకమే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి ప్రత్యేకత మరోసారి చాటుకున్నారు. పిఠాపురంలో 45 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఒంటరి మహిళలుగా ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకుంటున్న 2439 మంది ఆడపడుచులకు పట్టుచీరలతో పాటు నూలు చీరలు అందించారు. గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాదిమందికి సందడి వాతావరణం లో చీరల పంపిణీ జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆయన పేరుతో గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు చెబుతూ చీరలు అందించారు. త్వరగా పవన్ కళ్యాణ్ కోరుకోవాలని ఆడపడుచులు ఆకాంక్షించారు.

* గతంలో చాలా సందర్భాల్లో..
గతంలో పిఠాపురంలో మహిళలకు సంబంధించిన ప్రధాన వేడుకలు, ప్రత్యేక పర్వదినాల్లో చీరలు అందించారు. శ్రావణమాసపు పూజలు జరిగినప్పుడు నాగబాబు భార్య స్వయంగా మహిళలకు చీరలు పంచిపెట్టారు పవన్ కళ్యాణ్ తరఫున. గతంలో గిరిజన మహిళలకు సైతం చీరలు పంపి తన ఉదాహరణ చాటుకున్నారు పవన్ కళ్యాణ్. మరోసారి ఒక గిరిజన గ్రామంలో పురుషులతో పాటు మహిళలు చెప్పులు వేయకపోవడానికి గుర్తించి.. ఆ గ్రామమంతటికి చెప్పులు పంపించారు. మరోవైపు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిన మధుర ఫలాలను సైతం గిరిజనులకు పంపించి.. అటువంటి సాగు చేపట్టాలని సూచించారు కూడా. అయితే ఇప్పుడు ఒంటరి మహిళలకు ఒక అన్నగా నిలబడిన పవన్ కళ్యాణ్ సర్వత్ర అభినందనలు అందుకుంటున్నారు. ఈరోజు ఇదే వైరల్ అంశంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper