Homeఎంటర్టైన్మెంట్The Paradise: వివాదంలో చిక్కుకున్న 'ది ప్యారడైజ్'.. ఇలా అయితే విడుదల అయ్యేది ఎప్పుడు?

The Paradise: వివాదంలో చిక్కుకున్న ‘ది ప్యారడైజ్’.. ఇలా అయితే విడుదల అయ్యేది ఎప్పుడు?

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఒక బ్రాండ్ న్యూ టీజర్ తో ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్. టీజర్ కి కూడా ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి […]

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఒక బ్రాండ్ న్యూ టీజర్ తో ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్. టీజర్ కి కూడా ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్టకేలకు అనేక వాయిదాల తర్వాత నాని ‘ది ప్యారడైజ్’ విడుదలకు మోక్షం కలిగింది. సెప్టెంబర్ 24 న థియేటర్స్ లో రికార్డుల జాతర మొదలు అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా మెడకు చుట్టుకున్న ఒక కొత్త వివాదం , విడుదలకు అడ్డు పడుతుందా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్యారడైజ్ స్టోరీ కర్నూలు లోని బంగారుపేట లో ఉన్నటువంటి షికారు జాతికి సంబంధించినది అని, మూడేళ్ళ క్రితం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటర్స్ మా ఇంటికి వచ్చి కథని సేకరించి వెళ్లారని , సినిమాలో మీకు క్రెడిట్స్ ఇస్తామని చెప్పి చివరికి మోసం చేసారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియా లో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం లో హీరో సారా కాస్తాడు , దొంగతనాలు చేస్తాడు , పిట్టలని పట్టుకుంటూ ఉంటాడు. ఇలా ఆయన జీవనం సాగుతూ ఉంటుంది. కావాలంటే సినిమా విడుదలయ్యాక చూడండి , ఇవన్నీ అందులో ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు తమ ఇంటికి కొంత మంది స్క్రిప్ట్ రైటర్లు వచ్చి , ఇతని వద్ద ఉన్నటువంటి కథ ని తీసుకెళ్లిన వీడియోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసాడు ఈ వ్యక్తి.

ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవ్వడం తో ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ కి చెందిన కథ తో , తెలంగాణ బ్యాక్ డ్రాప్ అని చెప్పి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇలా తీస్తున్నాడా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యక్తి చేసిన కామెంట్స్ లో ఎంత నిజముంది?, ఈ కామెంట్స్ పై మూవీ టీం రెస్పాన్స్ ఇస్తుందా?, ఒకవేళ ఈ వ్యక్తి చెప్పేది నిజమైతే కోర్టు కి వెళ్లి కేసు వేయొచ్చు కదా, ఎందుకు వీడియోలు చేస్తున్నాడు అంటూ పలువురు ఇతన్ని విమర్శిస్తున్నారు. మరి ఏది నిజమో , ఏది అబద్దమో కాలమే నిర్ణయించాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper