Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh: 'ది ప్యారడైజ్' లో ఐటెం సాంగ్ కోసం కీర్తి సురేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్...

Keerthy Suresh: ‘ది ప్యారడైజ్’ లో ఐటెం సాంగ్ కోసం కీర్తి సురేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో , ఈ చిత్రానికి అంతకు మించిన డిమాండ్ ఉంది. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా క్షణాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ , మహేష్ […]

Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో , ఈ చిత్రానికి అంతకు మించిన డిమాండ్ ఉంది. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా క్షణాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ సినిమాలకు గతం లో ఇలాంటి క్రేజ్ ని చూసేవాళ్ళం, ఇప్పుడు నాని కి చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో ఈ చిత్రం పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ చిత్రం లోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ లో కీర్తి సురేష్ నాని తో కలిసి చిందులు వెయ్యబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ , మొట్టమొదటిసారి నాని కోసం ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒప్పుకుంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకొని ఉంది ఉంటుంది? అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ సాగుతోంది. మీడియం రేంజ్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ కోసం 2 కోట్ల రూపాయిలు తీసుకుంటున్న రోజులివి , కీర్తి సురేష్ కచ్చితంగా 5 కోట్ల రూపాయిలు తీసుకుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఆమె ఈ ఐటెం సాంగ్ కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట.

ఎందుకంటే కీర్తి సురేష్ నాని కి అత్యంత సన్నిహితురాలు, ఆయన కుటుంబానికి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే నాని అడగగానే వెంటనే ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. రెమ్యూనరేషన్ టాపిక్ ఆయన తీసుకొని రాగా, ఒక్క పైసా కూడా అక్కర్లేదని చెప్పిందట. కానీ నాని రెమ్యూనరేషన్ తీసుకోవాల్సిందిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. కానీ కీర్తి సురేష్ ఒప్పుకోలేదట. అలా రెమ్యూనరేషన్ లేకుండానే ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. సెప్టెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఐటెం సాంగ్ సినిమాకు ఎంత ప్లస్ అవ్వబోతుందో చూడాలి. గతం లో నాని , కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’, ‘దసరా’ వంటి సూపర్ హిట్స్ లో నటించిన సంగతి తెలిసిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper