Ramayan: మన ఇండియన్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. ఒక్కో డైరెక్టర్ తమకు ఉన్నటువంటి అద్భుతమైన విజన్ తో , టెక్నాలజీ పరంగా ఎక్కడా తగ్గకుండా హై స్టాండర్డ్స్ క్వాలిటీ తో సినిమాలు తీయడమే కాదు , వాటిని అదే రేంజ్ విడుదల కూడా చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే #RRR చిత్రాన్ని ఓటీటీ ద్వారా కోట్లాది మంది పశ్చిమ దేశానికి చెందిన మూవీ లవర్స్ ఎగబడి చూడడం మొదలు పెట్టారో , అప్పటి నుండి మన ఇండియన్ సినిమాకు హాలీవుడ్ లో ద్వారాలు తెరుచుకున్నాయి. అందుకే ఇప్పుడు ‘వారణాసి’ చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా విడుదలైన హాలీవుడ్ సెన్సేషన్ ‘ది ఒడిస్సీ’ మూవీ రికార్డు ని డబుల్ మార్జిన్ తో హిందీ ‘రామాయన్’ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 25 వేల స్క్రీన్స్ లో విడుదలైన ‘ది ఒడిస్సీ’ చిత్రం 750 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అయితే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయన్’ చిత్రాన్ని నవంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటెర్టైమెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని 50 వేల స్క్రీన్స్ లో విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే థియేటర్స్ బుకింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ‘ది ఒడిస్సీ’ విడుదలైన థియేటర్స్ కి రెండింతలు ఎక్కువ కౌంట్ తో ఈ చిత్రం విడుదల అవుతోంది. మరి కలెక్షన్స్ విషయం లో కూడా ‘ది ఒడిస్సీ’ ని దాటేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ‘రామాయన్’ కథని పర్ఫెక్ట్ గా వెండితెర మీదకు తీసుకొని రావాలే కానీ ‘ది ఒడిస్సీ’ ని మించిన వసూళ్లు రావడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు నెటిజెన్స్.
ఎందుకంటే రామాయణం కథలో గొప్ప ఫాంటసీ ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే, రామాయణం లోని అనేక ఘట్టాలను ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేంత ఎమోషనల్ గా సన్నివేశాలను తెరకెక్కించవచ్చు. మరి ఆ రేంజ్ లో ‘రామాయన్ ‘ ని డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించాడో లేదో చూడాలి. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి గొప్ప రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. 4000 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించమని అంటున్నారు , కానీ ట్రైలర్ చూస్తుంటే వంద కోట్లు కూడా అయ్యినట్టు లేదంటూ సెటైర్లు విసురుతున్నారు. మరి అందరి అంచనాలను అధిగయించి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.