Homeక్రైమ్‌IPS Officer Daughter Accident: ఊహించని ప్రమాదం.. ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపీ కుమార్త్ యాక్సిడెంట్...

IPS Officer Daughter Accident: ఊహించని ప్రమాదం.. ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపీ కుమార్త్ యాక్సిడెంట్ లో మృతి..

IPS Officer Daughter Accident: స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లిన ఓ ట్రాఫిక్ డిసిపి కుమార్తె విగత జీవిగా కనిపించారు.. అనుకోకుండా వచ్చిన ప్రమాదంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని గుంటూరు నగర శివారులో చోటుచేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపి షిరిన్ బేగం కుమార్తె షేక్ అసిఫా తన స్నేహితులతో కలిసి కారులో చీరాలకు విహారయాత్రలకు వెళ్లారు. అయితే వీరు గుంటూరు […]

IPS Officer Daughter Accident: స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లిన ఓ ట్రాఫిక్ డిసిపి కుమార్తె విగత జీవిగా కనిపించారు.. అనుకోకుండా వచ్చిన ప్రమాదంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని గుంటూరు నగర శివారులో చోటుచేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపి షిరిన్ బేగం కుమార్తె షేక్ అసిఫా తన స్నేహితులతో కలిసి కారులో చీరాలకు విహారయాత్రలకు వెళ్లారు. అయితే వీరు గుంటూరు నగర శివారులోని ఏటుకూరు సమీపంలోకి రాగానే వీరి కారు ముందు వెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఈ లారీ వెనుక వస్తున్న షేక్ అసిఫా కారు ఒక్కసారిగా ముందున్న లారీని ఢీ కొట్టింది. అయితే ఆ తర్వాత ఈ కారు డివైడర్ ను ఢీ కొట్టి ఆగిపోయింది. అయితే కారు ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. అయితే షేక్ అసిఫా వెనుక సీట్లో కూర్చోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వచ్చి ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల పరీక్షించిన తర్వాత ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసుల సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో షేక్ హసీనాతో పాటు తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్, అవినాష్, సుధీర్, వంశీ ఉన్నారు. రిత్విక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సుభాని తెలిపారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ట్రాఫిక్ డీసీపీ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె ఇటీవల సర్జరీ అనంతరం కోలుకొని తిరిగి వీధుల్లో చేరారు.

ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న షేక్ అసిఫా చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని అన్నారు. అలాగే హోం మంత్రి అనిత కూడా ఈ ఘటనపై స్పందించారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper