Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ సెడాన్, హ్యాచ్ బ్యాక్ కార్ల ఉత్పత్తిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు SUV కార్లపై ఫోకస్ పెట్టబోతుంది. ఇందులో భాగంగా వచ్చే కాలంలో మొత్తం ఎస్ యూవీ కార్లనే తీసుకొచ్చేలా భారీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా 7 కొత్త కార్లు రాబోతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే?
దేశీయగా ప్యాసింజర్ కార్ల వినియోగం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షించాలని కార్ల కంపెనీలు రెడీ అవుతున్నాయి. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారత కార్ల పరిశ్రమ వార్షికంగా 61 లక్షల నుంచి 63 లక్షల యూనిట్ల స్థాయికి చేరుకుంటుందని మారుతి సుజుకి అంచనా వేసింది. ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా కంపెనీ ఇప్పటికే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్ల మేర పెంచుకుంది.
కేవలం వాహనాల తయారీకే పరిమితం కాకుండా, పర్యావరణ హితమైన క్లీన్ ఎనర్జీ వైపు కూడా మారుతి సుజుకి కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘గోబారాధాన్’ పథకంలో భాగంగా, తొలి విడతలో నాలుగు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ. 561 కోట్ల పెట్టుబడికి మారుతి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఇంధనం దిగుమతి చేసుకునే సీఎన్ జీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ వాడకం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.
ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా 24.22 లక్షల వాహనాలను విక్రయించగా.. అందులో 4.47 లక్షల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేశారు. వరుసగా మూడో సంవత్సరం 20 లక్షల వార్షిక అమ్మకాల మార్కును దాటిన మారుతి.. రాబోయే రోజుల్లో కొత్త ఎస్ యూవీల లాంచ్‌లు, క్లీన్ ఇంధన సాంకేతికతల ద్వారా తన తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.