Motorola Moto G Max: మోటోరోలా కంపెనీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే కొందరు చాలా ఆసక్తి చూపుతారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ కొత్త బ్రాండ్లను తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా కొత్త స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ మ్యాక్స్’ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. స్వాత్రంత్ర్య దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఈ ఫోన్ ఇండియాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం..
మోటో జీ మ్యాక్స్ ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా మైక్రో సైట్ టీజర్ పేజీని ప్రారంభించి, ఫోన్ యొక్క కీలక వివరాలను తెలిపింది. ఈ మొబైల్ లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్మూత్ స్క్రోలింగ్ ఉండ నుంది. 1050 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండడం వల్ల ఎలాంటి వాతావరణంలోనైనా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఈ కొత్త ఫోన్ లో క్వాల్కమ్ లేటెస్ట్ ‘స్నాప్‌డ్రాగన్ 6 ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ఉండనుంది. అలాగే వేగవంతమైన పనితీరు కోసం ఎల్ పీడీడీఆర్5 ఎక్స్ ర్యామ్ ను ఉంచారు. అలాగే యూఎఫ్ఎస్ 3.2 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ ను అందించారు. దీంతో యాప్‌లు త్వరగా ఓపెన్ అవ్వడమే కాకుండా, హెవీ గేమింగ్ మరియు టాస్క్‌లు ఎటువంటి లాగ్ లేకుండా సాగుతాయి.
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటాయి. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 ఎంపీ సెకండరీ కెమెరా..సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. ఈ కెమెరాలు లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, ప్రత్యేకమైన మోటోరోలా కెమెరా మోడ్స్‌ను కలిగి ఉన్నాయి.
ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉండగా.. దీనికి ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. ఆడియో పరంగా అద్భుతమైన సౌండ్ అనుభూతి కోసం స్టీరియో స్పీకర్లు ,డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ను ఇందులో జోడించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ అయ్యే ఈ ఫోన్‌కు 2 ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని మోటోరోలా స్పష్టం చేసింది.