Homeవింతలు-విశేషాలుLion Roar: సింహం గర్జన ఎంత దూరం వినిపిస్తుంది?

Lion Roar: సింహం గర్జన ఎంత దూరం వినిపిస్తుంది?

Lion Roar: అడవికి రారాజుగా పేరొందిన సింహం.. తన గర్జనతోనే జంతు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బలానికి.. ధైర్యానికి ప్రతీకగా భావించే వీటి జీవనశైలి కూడా ఎంతో ఆసక్తికరం. రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం నుంచి కిలోమీటర్ల దూరం వినిపించే గర్జన వరకు.. సింహాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ప్రపంచ సింహాల దినోత్సవంను ఆగస్టు 10న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మృగరాజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ప్రపంచవ్యాప్తంగా సింహాల సంరక్షణ, […]

Lion Roar: అడవికి రారాజుగా పేరొందిన సింహం.. తన గర్జనతోనే జంతు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బలానికి.. ధైర్యానికి ప్రతీకగా భావించే వీటి జీవనశైలి కూడా ఎంతో ఆసక్తికరం. రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం నుంచి కిలోమీటర్ల దూరం వినిపించే గర్జన వరకు.. సింహాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ప్రపంచ సింహాల దినోత్సవంను ఆగస్టు 10న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మృగరాజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

ప్రపంచవ్యాప్తంగా సింహాల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ, సింహాల సంఖ్య తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం కోసమే సింహాల దినోత్సవంను నిర్వహిస్తున్నారు. సింహం అనగానే గర్జన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింహం గర్జన దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపించగలదు. దాని గర్జన తీవ్రత సుమారు 114 డెసిబెల్స్ వరకు ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

సింహాలు రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటాయి. సాధారణంగా 16 నుంచి 20 గంటల వరకు విశ్రాంతి లేదా నిద్రలో గడుపుతాయని చెబుతారు. వేట కోసం శక్తిని ఆదా చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే సమయంలో కదలికలను తగ్గించి, చల్లటి సమయాల్లోనే ఎక్కువగా చురుగ్గా ఉంటాయి.

పెద్ద పిల్లుల్లో గుంపులుగా జీవించే ప్రత్యేకత సింహాలకు ఉంది. వీటి గుంపును సాధారణంగా ‘ప్రైడ్’ అంటారు. ఒక ప్రైడ్‌లో ఆడ సింహాలు, పిల్లలు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మగ సింహాలు ఉండవచ్చు. వేట, పిల్లల సంరక్షణ, ప్రాంత రక్షణ వంటి పనుల్లో గుంపు జీవనం ఎంతో ఉపయోగపడుతుంది.

ఇప్పుడు మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. కానీ ఒకప్పుడు సింహం కూడా భారత జాతీయ జంతువుగా ఉండేది. భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 1972లో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశంలో సింహం స్థానంలో పులిని జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి పులి దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉండటం. అప్పట్లో పులి 16 రాష్ట్రాల్లో కనిపించగా.. ఆసియా సింహం మాత్రం ఒక్క గుజరాత్ రాష్ట్రానికే పరిమితమై ఉండేది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper