Tollywood: మన టాలీవుడ్ లో ఒక సినిమా మొదలు అవ్వడం , ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల చేత ఆగిపోవడం వంటివి కొత్తేమి కాదు. గతం లో ఎన్నో ఉదాహరణలు మనం చూసాము. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి , కొంత షూటింగ్ ని పూర్తి చేసుకున్న సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒక క్రేజీ కాంబినేషన్ కి ఇదే జరిగింది. రీసెంట్ గానే ఎంతో గ్రాండ్ గా ఈ చిత్రం మొదలైంది. ఈ ఏడాది లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేలా ప్లానింగ్ చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది. హీరో కి ఈమధ్య కాలం లో ఒక్క ఫ్లాప్ తప్ప , అన్నీ సూపర్ హిట్స్ మాత్రమే ఉన్నాయి.
అదే విధంగా డైరెక్టర్ కి కెరీర్ మొత్తం మీద హిట్స్ , కానీ ఒకే ఒక్క ఘోరమైన డిజాస్టర్ ఉంది. కానీ రీసెంట్ గానే ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి ఫార్మ్ లోకి వచ్చాడు. ఆ హిట్ కి సీక్వెల్ చేయడం ఇష్టం లేక , హీరో తప్పుకున్నాడు. దీంతో ఆ డైరెక్టర్ కొంతమంది హీరోలకు కథలు వినిపించాడు , వారిలో ఒక హీరో ఒప్పుకొని రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు జరిపితే , ఇప్పుడు హీరో కి డైరెక్టర్ కి మధ్య ఏర్పడిన కొన్ని క్రియేటివ్ బేధాలు వల్ల సినిమాని ఆపేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఈపాటికే మీ అందరికీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. రీసెంట్ గా ఆయన సినిమా పాన్ ఇండియా హిట్ అయినప్పటికీ కూడా హీరోలు ఈ డైరెక్టర్ పై నమ్మకం చూపడం లేదు.
రీసెంట్ పాన్ ఇండియన్ హిట్ కూడా , హీరో స్టార్ డమ్ వల్ల హిట్ అయ్యింది కానీ , సరైన కంటెంట్ ఇవ్వలేదు. అందుకే ఆ హీరో కూడా సీక్వెల్ కి నో చెప్పాడు. పాపం ఇప్పుడు ఈ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చేది ఎవరో చూడాలి. ఒకప్పుడు ఈ డైరెక్టర్ కోసం టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ క్యూలు కట్టేవారు. కాల్ షీట్స్ కోసం ఎగబడేవారు , నిర్మాతలు బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు , సీనియర్ హీరోలు కూడా ఇతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.