HomeతెలంగాణTelugu Media: వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనక్కి.. ఆ పత్రిక సెంట్రల్ డెస్క్ ఖాళీ

Telugu Media: వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనక్కి.. ఆ పత్రిక సెంట్రల్ డెస్క్ ఖాళీ

Telugu Media: వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బాబు మా వల్ల కాదు అంటూ నమస్కారం పెట్టి వచ్చినదారిలో వెళ్ళిపోతున్నారు. గొప్ప జీతాలు కావు. గొప్ప స్థాయి అంతకంటే కాదు. పైగా దయ్యాలు తిరిగే వేళలో పనిచేయాలి. ఇదంతా మా వల్ల కాదని చాలామంది నమస్కారం పెట్టి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇదంతా ఓ పేరు మోసిన పత్రికలో జరుగుతున్న వ్యవహారం. ఆ పత్రికలో పెద్ద తలకాయలకు జీతాలు బాగానే […]

Telugu Media: వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బాబు మా వల్ల కాదు అంటూ నమస్కారం పెట్టి వచ్చినదారిలో వెళ్ళిపోతున్నారు. గొప్ప జీతాలు కావు. గొప్ప స్థాయి అంతకంటే కాదు. పైగా దయ్యాలు తిరిగే వేళలో పనిచేయాలి. ఇదంతా మా వల్ల కాదని చాలామంది నమస్కారం పెట్టి తమ దారి తాము చూసుకుంటున్నారు.

ఇదంతా ఓ పేరు మోసిన పత్రికలో జరుగుతున్న వ్యవహారం. ఆ పత్రికలో పెద్ద తలకాయలకు జీతాలు బాగానే ఉంటాయి. పైగా ఆ పత్రిక అధిపతి గతంలో ఒక ఛానల్ పెట్టారు. అది లాభాల్లోకి వచ్చేసింది. పైగా ఇటీవల జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఖరీదైన ఏరియాలో అతిపెద్ద భవనాన్ని కట్టారు. సుమారు 7 అంతస్థుల లో దాని నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ పత్రికకు గుండెకాయ లాంటి సెంట్రల్ డెస్క్ లో పని చేయడానికి ఉపసంపాదకులు అవసరం ఏర్పడింది.

ఇటీవల కాలంలో ఆ పత్రికలో పని చేసే పెద్ద తలకాయలు ప్రకటన ఇద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ పత్రిక సెంట్రల్ డెస్క్ లో ఖాళీలు ఉన్నాయని విషయాన్ని తెలుసుకుని కొంతమంది రెస్యూమ్ లు పట్టుకొని వచ్చారు. అక్కడి అసిస్టెంట్ ఎడిటర్ వారిని ఇంటర్వ్యూ చేశారు. వారిని విధుల్లోకి తీసుకున్నారు. కానీ ఇచ్చే జీతం ఏమో తక్కువ.. చేయించే చాకిరీ ఎక్కువ.. పైగా సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ కి వస్తే.. ఎప్పుడో అర్ధరాత్రి రెండు గంటలకు గానీ ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు.

జీతం ఇప్పటి ఖర్చులకు అనుకూలంగా లేకపోవడం.. విధులు అత్యంత కఠినంగా ఉండడంతో వచ్చిన ఉద్యోగులు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఆ పత్రిక సెంట్రల్ డెస్క్ దాదాపుగా ఖాళీ అయినట్టు తెలుస్తోంది. గతంలో ఉన్న వాళ్ళతోనే పనిచేయిస్తున్నట్టు సమాచారం. వారిలో కూడా చాలామంది ఎక్స్టెన్షన్ మీద కొనసాగుతున్నారు. వారిలో చాలామందికి దాదాపు 60 ఏళ్లకు దగ్గరగా వయసు వచ్చేసింది. ఇక ఈ వయసులో బీపీలు, షుగర్లు ఎలాగూ ఉంటూనే ఉంటాయి. అలాంటివారు ఏం పని చేయగలుగుతారు.. ఎంతకాలం పత్రికలో ఉండగలుగుతారు.. ఇప్పుడు ఇదే ప్రశ్న ఆ మేనేజ్మెంట్కు వచ్చేసింది. కానీ ఆ మేనేజ్మెంట్ ఆశించిన స్థాయిలో వేతనాలు ఇవ్వదు. ఉద్యోగులకు సరైన స్థాయిలో సదుపాయాలు కల్పించదు. అందువల్లే అందులో పనిచేయాలని అనుకొని వచ్చిన ఉద్యోగులు ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుగు మీడియాలో ఇంతటి నికృష్టమైన వ్యవస్థ.. దరిద్రమైన మేనేజ్మెంట్ ఇందులో తప్ప ఎక్కడ ఉండదని జర్నలిస్టు వర్గాలలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ మేనేజ్మెంట్ మారదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper