New Car Purchase: ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల నిమిత్తం చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో తక్కువ ధరలోని కార్లను కొన్నవారు లేదా కొత్తగా కొనేవారు ఎక్కువగా స్పేస్ తో పాటు అత్యధిక పవర్ ఉన్నవాటిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి అప్పుడు కారు ధర రూ.10 లక్షల కంటే పైగానే ఉంటుంది. అయితే దీనికంటే తక్కువ ధరలో కొనుగోలు చేస్తే కొన్ని చార్జీలు ఉండవు. కానీ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే TCS అనే చార్జి విధిస్తారు. దీనిని రిఫండ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధరకు కారు కొనేవారు ప్రభుత్వానికి అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనినే Tax Collected at Source (TCS) అని అంటారు.ఇది కారు ధరను బట్టి 1 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఉదాహరణకు ఒక కారు ఎక్స్ షోరూం ధర రూ.14.98 లక్షలు ఉంటే అదనంగా టిసిఎస్ ను రూ. 14,979 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే చాలామంది ఈ మొత్తాన్ని చెల్లించి ఆ తర్వాత పట్టించుకోరు. కానీ దీనిని రిఫండ్ కూడా చేసుకుని అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. దీనిని ప్రభుత్వానికి చెల్లిస్తున్నందున.. తిరిగి ఆదాయపు పన్ను చట్టం 2025 సెక్షన్ 394 ద్వారా రిఫండ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు ఈ విషయాన్ని అందులో పొందుపరిస్తే ఎంత మొత్తం చెల్లించామో ఆ మొత్తం రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వస్తే అందులో ఈ మొత్తాన్ని తీసివేసి మిగతా అమౌంట్ ను తీసుకుంటారు.
ఈ విధంగా టిసిఎస్ ను రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా కారు కొనుగోలు చేసిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు ఫామ్ 26AS/AIS లో కనిపిస్తాయి. అయితే పాన్ కార్డులో తప్పులు ఉన్నా .. లేదా ఇతర వివరాలు సరైన విధంగా లేకపోతే ఈ మొత్తం రిఫండ్ రాకపోవచ్చు. అందువల్ల కారు కొనుగోలు చేసేటప్పుడు ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా చార్జీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ షోరూం తర్వాత ఎలాంటి చార్జీలు విధిస్తున్నారు చెక్ చేసుకోవడం చాలా అవసరం.