Homeబిజినెస్New Recharge Plans: ఫోన్ రీచార్జ్ చేసుకునే వారికి గట్టి షాక్

New Recharge Plans: ఫోన్ రీచార్జ్ చేసుకునే వారికి గట్టి షాక్

New Recharge Plans: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని ప్లాన్లను మార్చివేస్తూ.. మరికొన్ని రీఛార్జ్లను ఎత్తివేసింది. దీంతో సామాన్యులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిర్ణీత రీఛార్జ్ కు అలవాటు పడినవారు.. ఇప్పుడు ఆ ప్లాన్ లో మార్పులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కారణాలు చెప్పలేదు కానీ సడన్లిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏ ఏ […]

New Recharge Plans: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని ప్లాన్లను మార్చివేస్తూ.. మరికొన్ని రీఛార్జ్లను ఎత్తివేసింది. దీంతో సామాన్యులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిర్ణీత రీఛార్జ్ కు అలవాటు పడినవారు.. ఇప్పుడు ఆ ప్లాన్ లో మార్పులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కారణాలు చెప్పలేదు కానీ సడన్లిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏ ఏ ప్లాన్లు మారుతున్నాయి? ఏ ఏ ప్లాన్లను ఎయిర్టెల్ ఎత్తివేసింది?

ఎయిర్టెల్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడిన రీఛార్జి ప్లాన్ రూ.299.. దీనిని రీచార్జ్ చేస్తే ప్రతిరోజు 1.5 జిబి డేటా రావడంతో పాటు నెలపాటు ఉచిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ లు వచ్చేవి. దీంతో ఎక్కువగా కమ్యూనికేషన్ రంగంలో ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడేది. అంతేకాకుండా రోజంతా హై స్పీడ్ నెట్ ను ఉపయోగించే వారికి కూడా అనుగుణంగా ఉండేది. ప్రస్తుతం ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ ఎత్తివేసింది. దీంతోపాటు రూ.559, రూ.649 రీఛార్జ్ ప్లాన్లకు కూడా గుడ్ బై చెప్పింది. ఇప్పటివరకు వీటిని రీచార్జ్ చేసుకున్నవారు ఇక వీటిని చూడలేరు..

అయితే ఇప్పటివరకు రూ.299 తో రీఛార్జ్ చేసుకున్నవారు ఇప్పుడు రూ.349 ప్లాన్ కు మారుతున్నారు. అయితే రూ.299 ప్లాన్ లోని డేటా ఇందులో ఉంటుంది. కానీ దీనికి అదనంగా రూ. 50 చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ఎయిర్టెల్ సంస్థ కొన్నింటి రీఛార్జ్ ప్లాన్లను ఎత్తివేసి మరికొన్నింటిని మార్పులు చేయడంతో ఆర్థికంగా భారం పడుతుందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే యూసర్లపై 16% భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎయిర్టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ మొత్తంలో ఉన్న రీఛార్జ్ ప్లాన్లను ఎత్తివేసి ఎక్కువ రేటు కలిగిన వాటిని కొనసాగించడం వెనక వినియోగదారులను అటువైపు మళ్ళించడమేనని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ కొత్త మార్పుల వల్ల ఎయిర్టెల్ సంస్థకు ప్రతి వినియోగదారుడు నుంచి రూ. నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నారు. గతంలోనూ ఇలా సగటు వినియోగదారుడు నుంచి ఆదాయం రాబట్టుకోవడానికి ఇలా రీఛార్జిల్లో మార్పులు చేసింది.

అయితే ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత వోడాఫోన్ ఐడియా బండి సమస్యలు కూడా ఇదే బాటలో వెళ్తారా? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండే రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎస్ఎంఎస్ లేదా కాలింగ్ అవసరం ఉన్నవారు వారికి అనుగుణంగా రీఛార్జి చేసుకోవాలని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper