Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామ్ చరణ్ ఇంతకుముందు బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నప్పటికి ఈ సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తద్వారా రామ్ చరణ్ ఇమేజ్ కూడా కొంతవరకు డౌన్ అయిందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలందరు డిఫరెంట్ సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ మాత్రం పెద్ది లాంటి సినిమాలను చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటూ అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంనే సుకుమార్ లాంటి దర్శకుడితో ఇంతకుముందు ఆయన చేసిన రంగస్థలం సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది.
కాబట్టి ఎప్పుడు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా అలాంటి ధోరణిలోనే రికార్డులు క్రియేట్ చేయబోతున్న విషయాన్ని కూడా మరోసారి చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సుకుమార్ డిఫరెంట్ సినిమాలను చేస్తారనే టాకైతే ఉంది.
కాబట్టి రామ్ చరణ్ కోసం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది 1960వ సంవత్సరంలో జరిగే కథ గా తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డాక్టర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒక ఊరు కోసం డాక్టర్ ఏం చేశాడు అనేదే ఈ కోణం స్టోరీ గా తెలుస్తుంది. ఈసారి కూడా సుకుమార్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
మొత్తానికైతే సుకుమార్ తన రేంజ్ మార్కును చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరించే సినిమాను చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు ఉంది. కాబట్టి దాన్ని మరోసారి వాడుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…