Vijay Deverakonda: ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. తన బోల్ట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా చాలా మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ఇప్పుడు సైతం ఆయన డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విజయ్ దేవరకొండ రాబోయే రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో డిఫరెంట్ సినిమాలను చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన రౌడీ జనార్దన్, రణబాలి అనే సినిమాలు చేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన సినిమాలు అతనికి నిరాశను మిగిల్చాయి. కాబట్టి ఇప్పుడు మొహమాటానికి పోయి సినిమాలు చేయడం కంటే కంటెంట్ తెలుసుకొని పక్కా ప్రణాళికతో ముందుకెళితేనే సక్సెస్ లు వరిస్తాయనే విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకే ఆయన సినిమాలను కొంతవరకు లేట్ చేసినప్పటికి చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ చాలా వరకు ఆస్తులనైతే సంపాదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక సినిమా కోసం దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాలనే కాకుండా బిజినెస్ లను కూడా భారీ ఎత్తున చేస్తున్నాడు. అతనికి రౌడీ అనే బట్టల స్టోర్స్ కూడా ఉన్నాయి.
అవే కాకుండా మరికొన్ని బిజినెస్ లు కూడా ఉండడంతో దాదాపు విజయ్ దేవరకొండ ఇప్పుడు 300 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇంత తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ చాలా బాగా సంపాదించాడు. అతనికి బిజినెస్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయని చాలామంది అతని మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఈ సంవత్సరం రష్మిక మందనా ను పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయిపోయాడు. ప్రస్తుతం టైర్ వన్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికైతే పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిపోయిన ఆయన ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఇంకా టాప్ హీరో రేంజ్ కు వెళ్లాల్సిన అవసరమైతే ఉంది…