Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పై విరుచుకుపడ్డ హీరో శ్రీకాంత్.. 'నీ లిమిట్స్ లో ఉండు'...

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పై విరుచుకుపడ్డ హీరో శ్రీకాంత్.. ‘నీ లిమిట్స్ లో ఉండు’ అంటూ వార్నింగ్.. వీడియో వైరల్..

Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా , తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేసిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లలో నవ్వులు పూయించాడు. ఒక విధంగా చెప్పాలంటే , ఒకానొక సమయం లో ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేని ఎంటర్టైన్మెంట్ షో ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. అలా […]

Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా , తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేసిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లలో నవ్వులు పూయించాడు. ఒక విధంగా చెప్పాలంటే , ఒకానొక సమయం లో ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేని ఎంటర్టైన్మెంట్ షో ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. అలా వచ్చిన ఫేమ్ , క్రేజ్ తో సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. నాలుగైదు సినిమాలు చేస్తే , అందులో ఒకటి కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తున్నాడు , అదే సమయం లో టీవీ షోస్ లలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు సుధీర్.

ప్రస్తుతం ఆయన జీ తెలుగు లో ప్రతి శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్స్ 9’ , అదే విధంగా ఈటీవీ లో ప్రతీ ఆదివారం రాష్ట్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘ది ఫ్యామిలీ స్టార్స్ 2’ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటిల్లో ‘డ్రామా జూనియర్స్ 9’ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , సీనియర్ హీరో శ్రీకాంత్ , రోజా వంటి వారు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళతో కలిసి సుధీర్ సరదాగా చేసే కామెడీ హైలైట్ అనే చెప్పాలి. అయితే సుధీర్ పై వేసే కొన్ని జోకులకు , ప్రాంక్స్ కి ఆయన అభిమానులు హర్ట్ అవుతున్నారు. యూట్యూబ్ కామెంట్స్ లో మా సుధీర్ ని అలా అవమానించకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న టెలికాస్ట్ అయినా ఎపిసోడ్ లో సుధీర్ పై శ్రీకాంత్ అరవడాన్ని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు.

శ్రీకాంత్ స్టేజి మీదకు రాగానే , ఆయనకు స్వాగతం పలుకుతూ ‘ఏంటన్నా అసలు.. మామూలోళ్లు కాదన్నా మీరు, ఎప్పుడు చూసిన చిన్న పిల్లాడి లాగా ముఖం పై నవ్వు తో కనిపిస్తారు’ అని చాలా చనువుగా మీద పడుతూ సుధీర్ డైలాగ్స్ చెప్పగానే ‘హేయ్ ఆపు ‘ అని శ్రీకాంత్ కోపం తో అరుస్తాడు. ‘హీరో లా కనపడడం లేదా నీకు.. ఏంటి ఇదంతా..తగ్గు కొంచెం తగ్గు..అతి చెయ్యకు’ అని అంటాడు శ్రీకాంత్. అప్పుడు సుధీర్ ‘అన్నా అలా కాదు , మాములుగా ఎప్పుడు సరదాగా ఉంటాము కదా అని అలా అన్నాను’ అని అంటాడు. ‘ఇన్నాళ్లు మొహమాటం తో ఆగాను. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు.. నాకు ఈ షో అక్కర్లేదు అసలు. నాకున్న గౌరవం నాకు ఉంది బయట’ అంటూ మండిపడ్డాడు శ్రీకాంత్. అప్పుడు సుధీర్ ఇదంతా ప్రోమో కోసం కాదు కదా అని అడగ్గా, అప్పుడు శ్రీకాంత్ ‘ప్రోమో ఏంటి?.. ప్రతీ దాన్ని కమర్షియల్ గా చూస్తావా’ నువ్వు అని అంటాడు శ్రీకాంత్. చివర్లో ‘ఒకే.. ఇది అసలు సిసలు ప్రోమో అంటే’ అని అంటాడు శ్రీకాంత్. ఇదంతా ప్రాంక్ లాగా ఆయన కవర్ చేసినట్టు అనిపించింది కానీ , నిజంగానే సుధీర్ పై కోపం తెచ్చుకున్నాడని అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Zee Telugu (@zeetelugu)

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper