Homeజాతీయ వార్తలుGold Smuggling: బంగారం కోసం తెగించాడు.. ఏకంగా అక్కడ దాచాడు.. నీకో దండం రా అయ్యా..

Gold Smuggling: బంగారం కోసం తెగించాడు.. ఏకంగా అక్కడ దాచాడు.. నీకో దండం రా అయ్యా..

Gold Smuggling: వళ్లు వంచి కష్టపడే వాడికి అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. దుర్మార్గాలకు పాల్పడాల్సిన కర్మ లేదు. సంపాదించే. విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ప్రతి పైసా అతనికి న్యాయబద్ధంగా వస్తూ ఉంటుంది కాబట్టి.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్యాయంగా.. అక్రమంగా.. దుర్మార్గంగా సంపాదించే వాళ్లకు మాత్రమే భయం ఉంటుంది. వారి వెన్నులో వణుకు పుడుతుంది. పైగా అటువంటి సొమ్మును దాచడానికి.. దొడ్డి దారిన తరలించడానికి వారు చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. […]

Gold Smuggling: వళ్లు వంచి కష్టపడే వాడికి అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. దుర్మార్గాలకు పాల్పడాల్సిన కర్మ లేదు. సంపాదించే. విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ప్రతి పైసా అతనికి న్యాయబద్ధంగా వస్తూ ఉంటుంది కాబట్టి.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.

అన్యాయంగా.. అక్రమంగా.. దుర్మార్గంగా సంపాదించే వాళ్లకు మాత్రమే భయం ఉంటుంది. వారి వెన్నులో వణుకు పుడుతుంది. పైగా అటువంటి సొమ్మును దాచడానికి.. దొడ్డి దారిన తరలించడానికి వారు చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. పైగా వాటిని దాచే సమయంలో.. అక్రమంగా తరలించే క్రమంలో వారు చేసే దుర్మార్గాలు చివరికి బయట పడుతుంటాయి. పోలీసుల చేతిలో శిక్ష పడేలా చేస్తుంటాయి.

బంగారానికి నెలవైన ప్రాంతాలలో జెడ్డా ఒకటి. ఈ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి బంగారాన్ని అహ్మదాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాడు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఖతార్ ఎయిర్ వేస్ సంస్థకు సంబంధించిన విమానంలో సర్ఫరాజ్ మాలా అనే 24 సంవత్సరాల యువకుడు జెడ్డా ప్రాంతం నుంచి గుజరాత్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. టెర్మినల్ నుంచి అతడు బయటికి వెళ్ళాడు. ఈ క్రమంలో తనిఖీ కేంద్రం వద్ద ఆ వ్యక్తి వ్యవహార శైలి మీద పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. మెటల్ డిటెక్టర్ తో స్కానింగ్ చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయం విలువలకు వచ్చింది. అతడు బంగారాన్ని కడ్డీగా మార్చి.. మ* ద్వారంలో దాచాడు. దానిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహకారం తీసుకొని అతడు దాచిన బంగారాన్ని బయటకి తీశారు ఆ బంగారం దాదాపు అరకిలో వరకు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు 65.69 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఇతర దేశాల నుంచి బంగారాన్ని ఇలాంటి మార్గంలో తరలించడం ఇదే తొలిసారి అని అక్కడి పోలీస్ అధికారులు చెబుతున్నారు. బంగారానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇలా అక్రమమార్గంలో తీసుకొచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. బంగారం అక్రమ మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఫలితంగా అక్రమార్కులు దొరికిపోతున్నారు. కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper