Homeఎంటర్టైన్మెంట్Bonalu Festival: బోనాలు జాతర లో హీరోయిన్స్ వైష్ణవి చైతన్య, ఫైరా అబ్దుల్లా చిందులు..వీడియో వైరల్

Bonalu Festival: బోనాలు జాతర లో హీరోయిన్స్ వైష్ణవి చైతన్య, ఫైరా అబ్దుల్లా చిందులు..వీడియో వైరల్

Bonalu Festival: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర ఎంత వైభవంగా జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాము. అమ్మవారి దేవాలయాలు ప్రతీ రోజు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆ భక్తుల్లో సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. హీరోయిన్లు సామాన్య భక్తులతో కలిసిపోయి , బోనాలు ఎత్తుకొని తీసుకొని రావడం ని చూసి చాలా మురిసిపోతున్నారు భక్తులు. కేవలం బోనాలు ఎత్తడం మాత్రమే కాదు, భక్తులతో కలిసి వాళ్ళు చిందులు కూడా వేయడం ఇప్పుడు హాట్ […]

Bonalu Festival: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర ఎంత వైభవంగా జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాము. అమ్మవారి దేవాలయాలు ప్రతీ రోజు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆ భక్తుల్లో సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. హీరోయిన్లు సామాన్య భక్తులతో కలిసిపోయి , బోనాలు ఎత్తుకొని తీసుకొని రావడం ని చూసి చాలా మురిసిపోతున్నారు భక్తులు. కేవలం బోనాలు ఎత్తడం మాత్రమే కాదు, భక్తులతో కలిసి వాళ్ళు చిందులు కూడా వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘జాతి రత్నాలు’, ‘మత్తు వదలరా 2’, ‘అనగనగా ఒక రాజు’, ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నిన్న బోనాలు జాతర లో పాల్గొని చిందులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఫరియా అబ్దుల్లా ముస్లిం మతానికి చెందిన అమ్మాయి. అయినప్పటికీ కూడా ఆమె హిందూ సంప్రదాయ పండుగల్లో పాల్గొని సంబరాలు చేసుకోవడం వంటివి చూసిన నెటిజెన్స్ , ఇది కదా సెక్యూలరిజం అంటే అని ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈమధ్య కాలం లో మతపరమైన గొడవలు చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి సమయం లో అన్ని మతాలను గౌరవించే ఇలాంటి సెక్యూలరిస్టులు ఉండడం చాలా గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇదే మీరాలం మంది శ్రీ మహాంకాళేశ్వర ఆలయం లో జరిగిన బోనాలు ఉత్సవం లో ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా పాల్గొన్నది. ఈమె కూడా అక్కడి డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గానే వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ లో బోనం ఎత్తడం మనమంతా చూసాము. ఇప్పుడు మీరాలం లో కూడా కనిపించింది.

చూస్తుంటే ఆమె షూటింగ్స్ అన్నిటికి విరామం ప్రకటించి బోనాలు సంబరాల్లో పాల్గొంటుందని తెలుస్తోంది. అట్టహాసం గా ఎంతో వైభవంగా జరిగిన ఈ మీరాలం మహాంకాళేశ్వర ఆలయ బోనాలు జాతర లో కల్వకుంట్ల కవిత , మల్లారెడ్డి కోడలు ప్రీతీ రెడ్డి వంటి వారు కూడా పాల్గొని సంబరాలు చేసుకుంటూ , భక్తులతో కలిసి చిందులు కూడా వేశారు. సెలబ్రిటీ హోదాలో ఉన్న వీళ్లంతా ఇలా సామాన్యులతో కలిసిపోయి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఇలాంటి అరుదైన ఘటనలు బోనాల ఉత్సవాల్లోనే జరుగుతూ ఉంటాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper