Mahesh Babu Next Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డౌన్ అయ్యాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే వారణాసి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ఉద్దేశ్యంతోనే ఆయన రాజమౌళి ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తున్నాడట. ఇక వారణాసి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో కాకుండా పాన్ వరల్డ్ లోనే ఆయన గొప్ప పేరు సంపాదించుకుంటాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందనే విషయం మీద చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. మొత్తానికైతే రాజమౌళి ఒక హీరోతో సినిమా చేసి తనకి సక్సెస్ ను అందించిన తర్వాత ఆ హీరో ఏ దర్శకుడితో చేసిన కూడా ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయనే టాకైతే ఉంది.
ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సైతం గత కొన్ని రోజులుగా తన తర్వాత సినిమా కోసం ఏ దర్శకుడిని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. ఇక రీసెంట్ గా తన బర్త్ డే జరిగిన సందర్భంలో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటి తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది.
తన భార్య అయిన నమ్రత సైతం మహేష్ బాబుకి క్లారిటీగా చెప్పేసిందిట. నెక్స్ట్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో సినిమా చేస్తేనే రాజమౌళి రేంజ్ కు తగ్గ సినిమా వస్తుందని మేకింగ్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ సందీప్ రెడ్డివంగా నెక్స్ట్ లెవెల్ అని ఆమె చెప్పిందట.
దాంతో మహేష్ బాబు సైతం సందీప్ కి ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారడమే కాకుండా మన దర్శకులను సైతం పాన్ వరల్డ్ దర్శకులుగా మార్చడంలో తన వంతు కృషి చేయబోతున్నాడనే విషయమైతే చాలా క్లారిటీగా అర్థమవుతుంది…