Mokshagna: నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న నటుడు మోక్షజ్ఞ… ఈయన ఎంట్రీ కోసం బాలయ్య తీవ్రమైన కసరతులు చేస్తున్నప్పటికి ఇప్పటివరకు ఆయన చేయబోయే సినిమా పట్టాలెక్కడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే హీరోగా పరిచయం అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకంటే చిన్నవాళ్ళు సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను సాధిస్తుంటే మోక్షజ్ఞ ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాడు. సక్సెస్ ఎప్పుడు సాధిస్తాడు అంటూ చాలామంది చాలా రకాల విమర్శలను చేస్తున్నారు.
అందుకే బాలయ్య ఎలాగైనా సరే మోక్షజ్ఞ ను రంగంలోకి దింపి మొదటి మూవీతోనే సక్సెస్ ను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘బింబిసార’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన వశిష్ట డైరెక్షన్ లో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను దసర కి ఓపెనింగ్ చేయబోతున్నారట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. వశిష్ట చిరంజీవి తో చేసిన విశ్వంభర సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినప్పటికి ఇంకా రిలీజైఅవ్వడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన అవ్వకపోయిన మోక్షజ్ఞ సినిమాను మాత్రం వశిష్ట స్టార్ట్ చేస్తారట.
కథను కూడా ఫైనల్ చేసిన బాలయ్య ఈ సినిమాతో మోక్షజ్ఞ కి అదిరిపోయే సక్సెస్ వస్తుందని మొదటి సినిమాతోనే తన స్టార్ హీరోగా మారిపోతాడు అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇపుడు కనక మోక్షజ్ఞ లేట్ చేస్తే మాత్రం ఇక నందమూరి అభిమానులు కూడా ఆయన కోసం ఎదురుచూడటం మానేస్తారు…