Bigg Boss Agnipariksha: మన తెలుగు రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ షో లో కంటెస్టెంట్స్ ని జడ్జీలు అవమానిస్తున్న తీరుపై సోషల్ మీడియా లో ప్రతీ రోజు నెటిజెన్స్ మండిపడుతూనే ఉన్నారు. సామాన్యులను జడ్జీలు మనుషులు లాగా కూడా చూడడం లేదని, వాళ్ళు ఎంతో మర్యాదతో వ్యవహరిస్తున్నప్పటికీ , జడ్జీలు తలపొగరుతో ప్రవర్తిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారని, ఈ షో ని బ్యాన్ చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలుగు తో పాటు , తమిళం , కన్నడ , మలయాళం మరియు ఇతర భాషల్లో కూడా ‘అగ్ని పరీక్ష’ షో మొదలైంది. వాటిల్లో కన్నడ ‘అగ్ని పరీక్ష’ షో లో ఒక కంటెస్టెంట్ పై జడ్జీలు వ్యవహరించిన తీరు , అందుకు ఆ కంటెస్టెంట్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నడ అగ్నిపరీక్ష లో పాల్గొన్న ఈ కంటెస్టెంట్ పేరు మాంజా. ఈయన ఆర్మీ కి చెందిన వ్యక్తి. అగ్ని పరీక్ష స్టేజి మీదకు రాగానే , ఇతన్ని అనేక ప్రశ్నలతో జడ్జీలు , యాంకర్ ఇబ్బంది పెట్టారు. ఇక చివరికి 90 సెకండ్ల టైం ఇస్తాము , జడ్జీలను ఇంప్రెస్ చేయండి అనే టాస్క్ ఇస్తాడు యాంకర్. అందుకు మాంజా ఒప్పుకోడు. ‘అది నా వల్ల కాదు , ఏదైనా టాస్క్ ఇవ్వండి, ఎంత కఠినమైనది అయినా చేసేస్తాను’ అని అంటాడు. అందుకు జడ్జీలు ‘ఇంప్రెస్ చేస్తే చెయ్యి..లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపో’ అంటారు. అందుకు మాంజా స్టైల్ గా తాను ధరించిన సూట్ లోపల ఉన్నటువంటి మైక్ తీసి , జడ్జీల ముఖం పై చూపిస్తూ , విసిరి పారేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజెన్స్, కన్నడ బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ ని చూసి నేర్చుకోండి. అక్కడ ఈ కంటెస్టెంట్ తన ఈగో మీద కొడితే, జడ్జీలకు ముఖం వచ్చిపోయే రేంజ్ లో సమాధానం చెప్పి వెళ్ళాడు. కానీ మన తెలుగు బిగ్ బాస్ లో జడ్జీలు హద్దులు దాటి మాట్లాడుతుంటే , కంటెస్టెంట్స్ చాలా సహనంగా భరిస్తున్నారు. ఇతని లాగా ధైర్యం చేసి ఒక్కరైనా సమాధానం చెప్పుంటే , బహుశా జడ్జీలకు తలపొగరుగా వ్యవహరించాలంటే భయం వేసేదేమో, మన కంటెస్టెంట్స్ దండగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే సోషల్ మీడియా లో సంచలనంగా మారిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram