Korean Kanakaraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు మంచి గుర్తింపైతే ఉంది. స్టార్ హీరోలుగా ఎదుగుతూ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం రేంజ్ హీరోలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమవుతున్నారు.వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ముందు వరుసలో దూసుకెళ్తున్నప్పటికి కొంతమంది హీరోలు మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నాన్న తంటాలు పడుతున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ల బాట పట్టాయి. దాంతో ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాలో కమెడియన్ సత్య చెప్పిన ఒక డైలాగు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతుంది. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే ‘మీ షార్ట్స్ చాలా ఇమ్మేచూరుగా ఉన్నాయి.’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక కొరియన్ కనకరాజు సినిమాలో ఆ డైలాగును సత్య ఇమిటేట్ చేస్తూ చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న డైలాగుని కాపీ ఎలా కొట్టారు.
సినిమా కోసం ఆ డైలాగును ట్రెండ్ చేసి వాళ్లే సినిమాని వదిలారా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వైజతమవుతున్నాయి. ఇక ఈ విషయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే బాలయ్య బాబు సైతం దర్శకుడు మేర్లపాక గాంధీ కి ఫోన్ చేశారట. ఈ విషయం మీద బాలయ్య కొంతవరకు సీరియస్ గా ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
కానీ మేర్లపాక గాంధీ మాత్రం గతంలో తాను ఎప్పుడో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారిని ఇమిటెడ్ చేస్తూ వచ్చిన ఒక డైలాగును చూసి సినిమాలో పెట్టానని చెప్పాడట. ఇక అనుకోకుండా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అదంతా యాదృచ్ఛికంగా జరిగిన తప్ప ప్లాన్ చేసింది కాదు అంటూ ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారట. దాంతో బాలయ్య బాబు కూడా ఓకే అని చెప్పినట్టుగా తెలుస్తుంది…