Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ...ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి ఒక నెల రోజులపాటు రెస్ట్ ఉండాలని నిర్ణయించారు. దాంతో నెల రోజులు తను సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం లేదు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్లోనే అతనికి గాయమైంది. కాబట్టి అందులో నెల రోజుల తర్వాత మళ్లీ ఆ […]

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి ఒక నెల రోజులపాటు రెస్ట్ ఉండాలని నిర్ణయించారు. దాంతో నెల రోజులు తను సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం లేదు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్లోనే అతనికి గాయమైంది. కాబట్టి అందులో నెల రోజుల తర్వాత మళ్లీ ఆ సినిమా షూటింగ్లోనే పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు చేయబోతున్న సినిమా విషయంలో ఇంకాస్త లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… రీసెంట్ గా బాలయ్యను కలిసిన కొరటాల శివ తను వీలైనంత రోజులు రెస్ట్ తీసుకోమని పూర్తిగా కోలుకొని గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తయ్యాకే మన సినిమా చేద్దామని చెప్పారట.

ఆలోపు కథలో ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి కథను ఇంకాస్త బెటర్ మెంట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నానని బాలయ్య బాబుతో చెప్పడంతో బాలయ్య కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికైతే ఇప్పుడు బాలయ్య ఎటు చూసినా కూడా తన అభిమానులు తన నుంచి సినిమా కావాలని కోరుకుంటున్నారు.

కాబట్టి దానికోసం ఆయన ఎంత కష్టపడినా సరే సంవత్సరానికి ఒక సినిమాని తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. అందులో భాగంగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ కామెంట్లు వ్యక్తమైనప్పటికి బాలయ్యకు ఇంజురీ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమా ఇంకాస్త లేటయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని కూడా పెంచే విధంగా ఉంటున్నాయి. అలాగే అతను వరుస సక్సెస్ లను సాధించడం వల్ల ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి పెద్ద హీరోల నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ తో కలకలాడుతాయని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper