Balakrishna: బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు సక్సెస్ లను సాధించాయి. ముఖ్యంగా ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒకటికి పది సార్లు స్క్రిప్ట్ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో బాలయ్య మొదటి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. బోయపాటి డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తన స్టార్ డమ్ ఎక్కడ తగ్గలేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది ఓవర్ బడ్జెట్ అవ్వడం వల్ల ఈ సినిమా తాతకాలికంగా నిలిపి వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ ని కూడా జరుపుకుంది. మధ్యలో ఎందుకని ఇలా జరిగిందనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే బాలయ్య బాబు ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తుంటాడు. అందువల్లే ఆయన డిఫరెంట్ సినిమాలు చేయకుండా రొటీన్ కమర్షియల్ సినిమాలను చేసిన కూడా తన అభిమానులు ఆదరిస్తారనే ఒక మొండి ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటివరకు బాలయ్య బాబు కెరియర్ లో సినిమాలను స్టార్ట్ చేసి ఆపివేసిన సినిమాలు చాలానే ఉన్నప్పటికి 2000 వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి అతని సినిమాలు చాలా వరకు ఆగిపోయాయి. అందులో బి.గోపాల్ దర్శకత్వంలో ‘హరిహర మహాదేవ’ అనే ఒక సినిమా స్టార్ట్ అయింది. అది ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. కానీ బాలయ్య బాబు ఇమేజ్ కి ఆ కథ సరిపోవడం లేదనే ఉద్దేశ్యంతో ఆ కథని పక్కన పెట్టారు…
ఇక వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య బాబు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఆల్మోస్ట్ సెట్స్ దాకా వచ్చిన ఈ ప్రాజెక్టు అనుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఓవర్ బడ్జెట్ అవుతుందనే ఇష్యూతో బాలయ్య బాబు ఆ సినిమాని క్యాన్సల్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇలా బాలయ్య చేయాలనుకున్న చాలా సినిమాలు పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే ఒక షెడ్యూల్ చేసిన తర్వాత కూడా ఆపివేసిన సందర్భాలైతే ఉన్నాయి… ఇక వాటన్నింటిని ఓవర్కం చేసుకుంటూ బాలయ్య ముందుకు సాగుతున్నాడు. కాబట్టే ప్రస్తుతం ఆయన టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు…