Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: స్థానిక ఎన్నికల పోటీ విషయంలో 'తగ్గేదేలే' అంటున్న పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న...

Pawan Kalyan: స్థానిక ఎన్నికల పోటీ విషయంలో ‘తగ్గేదేలే’ అంటున్న పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్..

Pawan Kalyan: ఈ ఏడాది అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జనసేన పార్టీ కి కేవలం 15 శాతం సీట్లు ఇస్తారని , 5 శాతం సీట్లు బీజేపీ […]

Pawan Kalyan: ఈ ఏడాది అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జనసేన పార్టీ కి కేవలం 15 శాతం సీట్లు ఇస్తారని , 5 శాతం సీట్లు బీజేపీ కి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ , 2024 సార్వత్రిక ఎన్నికల సమయం లో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు వర్తించదు, కచ్చితంగా జనసేన కి బలమున్న ప్రతీ చోట మేము పోటీ చేయబోతున్నాము అంటూ ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో కొంత ఉత్సాహం నెలకొంది.

జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 30 శాతం సీట్లు ఆశిస్తున్నట్టు టాక్. అంతకు మించి తగ్గేది లేదని తెగేసి చెప్పారట. సీఎం చంద్రబాబు , నారా లోకేష్ లు కూడా అందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులకు , కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో ఎంత బలంగా పోటీ చేయబోతున్నామో లేటెస్ట్ ట్వీట్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ జనసేన శ్రేణుల్లో నింపిన ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది అనొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్దిరోజుల నుండి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ , నేడు అసెంబ్లీ లోని తన క్యాబినెట్ తో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వాళ్ళతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి , అదే విధంగా కమిటీల గురించి చాలా లోతైన చర్చ చేశారు. ఈ చర్చ తర్వాత ఆ ఒక ట్వీట్ వేస్తూ ‘జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అందరం కలిసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా , వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకొని వెళ్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు.

దీని అర్థం ఏమిటంటే , కార్యకర్తలను ఈసారి నిరాశపరిచి సమస్యే లేదు , మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను , ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో పోటీ చేయబోతున్నాము అని. జనసేన పార్టీ వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో , దాదాపుగా 350 కి పైగా MPTC లు గెలుచుకుంది. తెలుగు దేశం పార్టీ కి 900 MPTC లు వచ్చాయి. అంటే జనసేన బలం బలహీనంగా ఉన్నప్పుడే ఈ రేంజ్ లో ఉంది , అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జనసేన బాగా బలపడింది, ఇప్పుడు ఈ పార్టీ కి స్థానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లను కేటాయిస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper