Balakrishna And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి బాలయ్య బాబు – జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొన్ని విభేదాలైతే వచ్చాయి. వీళ్లిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదంటూ కొన్ని కామెంట్స్ వచ్చాయి. రీసెంట్ గా బాలయ్య బాబు సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. అప్పుడు ఎన్టీఆర్ బాలయ్య బాబుని కలిసినట్టుగా తెలుస్తుంది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారు అంటు కొన్ని వార్తలు వచ్చాయి. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి వాళ్ళ అభిమానులను మీట్ అవ్వబోతున్నారట. దీనికోసం ఒక పెద్ద సభను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా నందమూరి హీరోలిద్దరు కలిసి పోవడం అనేది వాళ్ళ అభిమానులకు కన్నుల పండుగగా చెప్పవచ్చు. వాళ్ళు చాలా రోజుల నుంచి బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే చూడాలని ఆసక్తిగా కోరుకుంటున్నారు. కానీ అదిఇప్పుడు వర్కౌట్ అయింది. ఇక ఏదేమైనా కూడా నందమూరి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో కూడా వీళ్లు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తూ నందమూరి ఫ్యామిలీ పేరు మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి కలిసి నటించడం అసాధ్యమని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు కలిసిపోయారు. కాబట్టి తొందరలోనే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ల కాంబోలో సినిమా వస్తే అది ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందనేది…