Homeఎంటర్టైన్మెంట్Agni Pariksha 2 Telugu: కుక్కల కంటే దారుణం.. 'బిగ్ బాస్' లో సామాన్యులతో ఇలా...

Agni Pariksha 2 Telugu: కుక్కల కంటే దారుణం.. ‘బిగ్ బాస్’ లో సామాన్యులతో ఇలా చేస్తారా..వీడియో వైరల్..

Agni Pariksha 2 Telugu:  మన తెలుగు లో అగ్నిపరీక్ష షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో సూపర్ హిట్ అయ్యేలోపు ఈ షో ని మిగిలిన భాషల్లో కూడా ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు పెట్టారు. ఇక రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ , జియో హాట్ స్టార్ లలో ప్రసారం అవుతున్న’అగ్ని పరీక్ష 2′ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా […]

Agni Pariksha 2 Telugu:  మన తెలుగు లో అగ్నిపరీక్ష షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో సూపర్ హిట్ అయ్యేలోపు ఈ షో ని మిగిలిన భాషల్లో కూడా ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు పెట్టారు. ఇక రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ , జియో హాట్ స్టార్ లలో ప్రసారం అవుతున్న’అగ్ని పరీక్ష 2′ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సామాన్యులను అవమానిస్తున్నారంటూ ఈ షో పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది , అదే సమయం లో వ్యూయర్ షిప్ కూడా గత సీజన్ తో పోలిస్తే రెండింతలు ఎక్కువ వచ్చింది. ఇకపోతే ఈరోజుటితో ఈ షోస్ లోని ఆడిషన్స్ పర్వం పూర్తిగా ముగిసింది. ఇక రేపటి నుండి కంటెస్టెంట్స్ కి అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. 18 మంది ఈ అగ్నిపరీక్ష కి ఎంపిక అవ్వగా, టాప్ 15 గా ఎవరు నిలుస్తారు , హౌస్ లోకి అడుగుపెట్టేది ఎవరు అనేది తదుపరి ఎపిసోడ్స్ లో తెలియనుంది.

ఇక పోతే రీసెంట్ గా ఈ అగ్నిపరీక్ష షో కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందులో కామానర్స్ ని బిగ్ బాస్ టీం ట్రీట్ చేస్తున్న విధానం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ వీడియో లో రెండు బస్సులు ఉంటాయి , వాటిల్లో కంటెస్టెంట్స్ అందరూ దూరాలి . ఈ క్రమంలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఒక్క అవకాశం కోసం వచ్చిన సామాన్యులను ఇంతలా అవమానించాలా?, అసలు వాళ్ళని మనుషులు లాగా కూడా చూడడం లేదంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇన్ని కష్టాలు పడి రౌండ్స్ క్లియర్ చేసుకొని కంటెస్టెంట్స్ ముందుకు వస్తున్నప్పటికీ కూడా జడ్జీలు ఎదో ఒక కారణం చేత ఆపేస్తున్నారు.

ఈరోజు ఎపిసోడ్ లో హోల్డ్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ ని ఎలాంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేశారు. వీరిలో రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం తో నెటిజెన్స్ ఈ షో పై తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకష్టపడి బస్సు టాస్క్ ఆడారు , కనీసం ఇందులో సెలెక్ట్ అయిన వారిని ఉంచుతారా?, లేదా తదుపరి రౌండ్స్ లో ఈరోజుటి లాగానే ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper