Husharu Pittalu: ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ మామూలుగా నిర్మాతలు. నిర్మాతలు పెద్ద హీరోలతో వందల కోట్ల రూపాయిల బడ్జెట్లు పెట్టి తీస్తున్నప్పటికీ రానటువంటి లాభాలు , చిన్న సినిమాలకు అవలీలగా వచ్చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాతలకు సేవియర్స్ గా మారిపోయాయి చిన్న సినిమాలు. అలాంటి చిన్న సినిమాల్లో ఒకటైన ‘హుషారు పిట్టలు’ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ లతో జెన్ జీ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షిచింది. కచ్చితంగా ఈ చిత్రానికి థియేటర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారు. కానీ ఈ సినిమా ఊహలకు మించే బాక్స్ ఆఫీస్ వద్ద లాభాల వర్షం కురిపించింది. విడుదలై 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతకు అయిన ఖర్చు, అక్షరాలా 50 లక్షలు. పబ్లిసిటీ మెటీరియల్ , మరియు ఇతరత్రా ఈవెంట్స్ అయినా ఖర్చులు మొత్తం కలిపితే 1 కోటి 50 లక్షల వరకు ఉంటుంది. అంత మొత్తం వసూళ్ల రూపం లో ఈ సినిమా రాబడితే కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో కేవలం నైజాం ప్రాంతం నుండి వచ్చిన వసూళ్లే 1 కోటి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. 4 వ రోజున ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రాగా, 5 వ రోజున 40 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
దీన్ని బట్టీ కలెక్షన్స్ ఎంత స్టడీ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీ రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక షేర్ వసూళ్లు ఈ 5 రోజులకు కలిపి 1 కోటి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే 10 లక్షలు లాభాలు అన్నమాట. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు మరింత భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘ఇరుముడి’ , ‘టాక్సిక్’ చిత్రాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు వసూళ్లు ఆగిపోవచ్చు కానీ , నెగటివ్ టాక్ వస్తే మాత్రం ‘హుషారు పిట్టలు ‘ చిత్రం ఈ ఏడాది లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలుస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.