Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరో గా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు ని సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు. ఒకానొక సమయం లో ఈయన లేడీస్ ఫాలోయింగ్ శోభన్ బాబు ని మించిపోయింది అనేవారు. 2006 వ సంవత్సరం వరకు హీరోగా ఏడాదికి కనీసం ఒక హిట్ ఇస్తూ వచ్చిన జగపతి బాబు , ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో హీరో గా మార్కెట్ మొత్తాన్ని కోల్పోయాడు. అలాంటి సమయం లో ‘లెజెండ్’ చిత్రం లో విలన్ గా నటించిన జగపతి బాబు కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇదంతా పక్కన పెడితే జగపతి బాబు చాలా ముక్కుసూటి మనిషి , ఏదైనా చాలా బోల్డ్ గా మాట్లాడుతాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. తనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
అయితే గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , తనకు ఒక అమ్మాయి మీద కోరిక కలిగిందని , ఆమెకు లక్ష రూపాయిలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ఒకే ఒకసారి ముజీర కి వెళ్లాను. లక్ష రూపాయిలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే. కానీ ముజీర చూడలేదు. అది నాకు చాలా నచ్చింది. ఆ డబ్బులకు కనీసం ఆమె ఒక నెల రోజుల పాటు సంతోషం గా ఉండి ఉంటుంది. అలాంటి వాళ్లకు కోటి రూపాయిలు ఇచ్చినా తప్పు లేదు. డబ్బులు ఇచ్చిన తర్వాత కనీసం ఆ అమ్మాయి ముఖం కూడా నేను చూడలేదు. కోరిక పుట్టింది , ఇచ్చాను వెళ్ళిపోయాను అంతే. అది కూడా హైదరాబాద్ ఫార్మ్ హౌస్ లోనే జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే జగపతి బాబు రీసెంట్ గా ‘పెద్ది’ మూవీ లో చేసినటువంటి ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాజిటివ్ రోల్ తో ఇంత మంచి పేరు జగపతి బాబు కి వచ్చి చాలా కాలమే అయ్యింది. ‘లెజెండ్’ చిత్రం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుతమైన ప్రారంభం గా ఎలా నిల్చిందో, ‘పెద్ది’ చిత్రం మూడవ ఇన్నింగ్స్ కి అంతే అద్భుతమైన ప్రారంభం గా నిల్చింది. ఇక్కడి నుండి ఆయనకు దాదాపుగా అలాంటి పాత్రలే దక్కుతాయని ఆశించవచ్చు.