Homeఎంటర్టైన్మెంట్Agni Pareeksha Season 2: 'అగ్ని పరీక్ష 2' లో కంటెస్టెంట్స్ ముఖం పై చెత్త...

Agni Pareeksha Season 2: ‘అగ్ని పరీక్ష 2’ లో కంటెస్టెంట్స్ ముఖం పై చెత్త విసిరిన మేకర్స్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

Agni Pareeksha Season 2: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇది వరకు మనం చూసిన ఎపిసోడ్స్ కేవలం ఒక మైక్రో టీజర్ లాంటిదే. ఆడిషన్స్ లో సామాన్యులను చాలా దారుణంగా అవమానిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రేపటి నుండి టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ ని చూసిన తర్వాత […]

Agni Pareeksha Season 2: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇది వరకు మనం చూసిన ఎపిసోడ్స్ కేవలం ఒక మైక్రో టీజర్ లాంటిదే. ఆడిషన్స్ లో సామాన్యులను చాలా దారుణంగా అవమానిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రేపటి నుండి టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ ని చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ని ఊహించడం కూడా కష్టమే. ముఖ్యంగా ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేయాల్సిందే. నిజ జీవితం లో వాళ్ళు ఎలా బ్రతికారో ఎవరికీ తెలియదు కానీ , బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు ఏమి చేయడానికైనా సిద్ధం ఆనేలాగా ఉన్నారు ఒక్కొక్క కంటెస్టెంట్. రేపటి నుండి ‘అగ్ని పరీక్ష’ కి సెలెక్ట్ అయిన వాళ్లకు నిర్వహించిన టాస్కుల ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు.

అందులో భాగంగా రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో లో కంటెస్టెంట్స్ కి పెట్టిన టాస్కులు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. అంతటి కఠినంగా ఉన్నాయి. ఈ టాస్కులకు ‘డేర్ ఆర్ డై’ అనే పేరు పెట్టారు. మొదటి టాస్క్ లో షాలిని పటేల్, అమన్ పాల్గొంటారు. వీళ్ళిద్దరిని ఒక గ్లాస్ లో బంధించి, పైన నుండి ఇతర కంటెస్టెంట్స్ చేత కూరగాయలకు సంబంధించిన చెత్త ని వేయిస్తారు. ఇది ముగిసిన తర్వాత వాళ్ళ చేతి ముందు ఒక బౌల్ లో ఆలుగడ్డలు ఉంటాయి. వాటిల్లో ఒక కీ ఉంటుంది. ఆ కీ ని సంపాదించి , వాళ్ళ ఎదురుగా ఉన్న లాకర్ ని ఎవరైతే ముందుగా ఓపెన్ చేస్తారో, వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచినట్టు.

ఈ టాస్క్ లో షాలిని గెలుస్తుంది. ఇక ఆ తర్వాత యాంకర్ శ్రీముఖి మరో పెద్ద ఛాలెంజ్ కంటెస్టెంట్స్ కి ఇస్తుంది. మీ ఎక్స్ లవర్ కి ఫోన్ చేసి, తప్పంతా నాదే , నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి మీ జీవితం లోకి మరోసారి వాళ్ళని ఆహ్వానించాలి. ఈ టాస్క్ లో శ్రేష్టి వ్యాకరణం పాల్గొనడానికి ముందుకు వస్తుంది. మరి ఆమె ఈ టాస్క్ లో నెగ్గిందా లేదా అనేది తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper