Homeఎంటర్టైన్మెంట్AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ ఏంటో..

AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు “ఇంటి” ఫ్యాంటసీ ఏంటో..

AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు అర్జున్. ఓ దశలో అల్లు అర్జున్ కు హిత బోధ చేయడానికి పూజ హెగ్డే తన శాడిజం మొత్తం చూపిస్తుంది.. ఆ తర్వాత ఈ కాళ్ల ఫాంటసీ ఏంటి అని అల్లు అర్జున్ కు క్లాస్ పీకుతుంది. సేమ్ ఆ సినిమాలో మాదిరిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇల్లు ఫాంటసీ అంటుకుంది. ఇది ఇప్పటిది కాదు.. అఆ సినిమా […]

AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు అర్జున్. ఓ దశలో అల్లు అర్జున్ కు హిత బోధ చేయడానికి పూజ హెగ్డే తన శాడిజం మొత్తం చూపిస్తుంది.. ఆ తర్వాత ఈ కాళ్ల ఫాంటసీ ఏంటి అని అల్లు అర్జున్ కు క్లాస్ పీకుతుంది.

సేమ్ ఆ సినిమాలో మాదిరిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇల్లు ఫాంటసీ అంటుకుంది. ఇది ఇప్పటిది కాదు.. అఆ సినిమా నాటి నుంచి ఆయనకు ఇది అంటుకుంది. ఆ సినిమాలో సమంత ఇంటిని అత్యంత విశాలంగా చూపించిన ఆయన.. ఆ తర్వాత వరుసగా అదే ఫార్ములాను పట్టుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి.. అజ్ఞాతవాసి.. అల వైకుంఠపురంలో.. సరిగా రెండేళ్ల క్రితం వచ్చిన గుంటూరు కారం.. ఇలా ప్రతి సినిమాలో ఇంటిని గట్టిగా చూపించడం.. ఇల్లు కేంద్రంగా సినిమా కథను అల్లుకోవడం మొదలుపెట్టాడు.

తాజాగా వచ్చిన ఆదర్శ కుటుంబం 47 సినిమా టీజర్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటినే నమ్ముకున్నాడు. టీజర్ ప్రారంభంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా వెంకటేష్ ను చూపించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత ధనవంతుడిగా మార్చేశాడు. ఎప్పట్లాగానే ధనవంతుడైన తర్వాత వెంకటేష్ ఇంటిని గొప్పగా మార్చేశాడు. వాస్తవానికి ఇటువంటి అద్భుతాలు ఒకటి లేదా రెండు సినిమాల్లో జరిగితే బాగుంటుంది. కానీ ప్రతి సినిమాలో ఇలాంటి వాటినే చూపిస్తే జనాలకు బోర్ కొడుతుంది. ఆల్రెడీ ఓటీటీలలో ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయే కంటెంట్ లభిస్తోంది. పైగా ప్రేక్షకులు కొత్త సినిమాలను కోరుకుంటున్నారు. అలాంటప్పుడు రొటీన్ కొట్టుడు సినిమాలను తీసి జనాల మీదికి వదిలితే.. గుంటూరు కారం ఫలితాలు మాత్రమే ఇస్తారు.

ఆల్రెడీ అజ్ఞాతవాసి సినిమాతో 90mm రాడ్ ఫలితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అర్థమైంది. అల వైకుంఠపురం కొత్త కథ కాకపోయినప్పటికీ ఇచ్చిన ట్రీట్మెంట్ బెటర్ గా ఉండడంతో జనం విరగబడి చూశారు. కానీ గుంటూరు కారంతో జనాలు ఏం చేయాలో అది చేశారు. ఇలాంటప్పుడు త్రివిక్రమ్ కథలు మార్చాలి. ముఖ్యంగా ఇంటిని మార్చాలి. అలా కాకుండా ప్రేక్షకులను ఏమార్చుకుంటూ పోతే.. ఫలితం బ్లాక్ బస్టర్ కాదు.. డిజాస్టర్ అవుతుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ ఖాతాలో ఖలేజా.. అజ్ఞాతవాసి.. గుంటూరు కారం ఉన్నాయి. ఈ జాబితాలోకి ఆదర్శ కుటుంబం రావద్దు అనుకుంటే చాలా మార్పులే చేయాలి. అంత సమయం ఉందా.. ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా పడింది.. ఈసారి వెంకటేష్ కాపడతాడా.. ఇంకేదైనా అద్భుతం జరుగుతుందా చూడాలి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper