Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధుల దోపిడీ గురించి సమయం దొరికిన ప్రతి సందర్భంలో చెబుతూనే ఉన్నారు. తనను పెట్టిన ఇబ్బందులను.. కష్టాలను ఏకరువు పెట్టుకుంటునే పోతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష గులాబీ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఒంటి కాలు మీద లేస్తున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను.. అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ మాజీ మంత్రి విద్యా వ్యాపారం ద్వారా సాగించిన దోపిడిని అంకెలతో సహా రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకొచ్చారు.
పాలమ్మిన.. పూలమ్మిన.. వందల కోట్లు సంపాదించిన.. అని చెప్పిన ఓ పెద్దమనిషి.. నిజంగానే పాలు.. పూలు అమ్మి 400 కోట్లు సంపాదించడం సాధ్యమేనా అధ్యక్ష.. నాడు ఐటీ అధికారులు ఆయన విద్యాసంస్థల మీద దాడి చేసినప్పుడు.. కనీసం కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇటువంటి వ్యక్తులు వందల కోట్లు వెనకేశారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ను బూచిగా చూపించి పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టారు. నాడు గులాబీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల కాలేజీలకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అందించారు. దీనిని బట్టి ఆ పథకం గులాబీ పార్టీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని మా మీద ఆ బాండాలు వేస్తున్నారు. వాళ్లు సక్రమంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి ఉంటే వేలకోట్ల బకాయిలు ఎందుకు ఉంటాయి. విద్యార్థుల ఖాతాలోనే ఫీజు రీబర్స్మెంట్ వేస్తాం. ఇందులో ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని” రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
పాలు.. పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చిన అని చెప్పుకునే మాజీ మంత్రికి రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారని పొలిటికల్ వర్గాలలో చర్చ నడుస్తోంది. వాస్తవానికి నాడు మంత్రిగా ఉన్న ఆయన భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారని ఆరోపణలు వినిపించాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే ఆ మంత్రికి సంబంధించిన కాలేజీ నిర్మాణాలను పడగొట్టారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికి విమర్శలు ఉన్నాయి. మరి ఆ మాజీ మంత్రి మీద మాటల వరకే రేవంత్ రెడ్డి పరిమితమవుతారా.. ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.
‘పాలమ్మినా, పూలమ్మినా రూ.వందల కోట్లు వస్తాయని నాకు తెలియదు’: రేవంత్
TG: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో పనిచేసిన ఓ మంత్రి యూనివర్సిటీ అకౌంట్లో రూ.400 కోట్లు కనిపించాయని తెలిపారు. అవి దోచుకున్న డబ్బా,… pic.twitter.com/nNQdQ9rezo
— BigTV APP (@BigtvApp) September 12, 2026