Vivo X500: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆపిల్ కంపెనీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించి కొత్త మోడల్ 3 మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ఆపిల్ కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రీమియం సెగ్మెంట్లో కస్టమర్లు ఆపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి అందరికీ ప్రీమియం ఫోన్ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత ఉండదు. కొంతమందికి బడ్జెట్ రేంజ్ లో ఫోన్లు కొనాలని ఉంటుంది. అటువంటి వారి కోసమే జైస్ కెమెరా విభాగంలో అనేకం మోడల్స్ మార్కెట్ లోకి రాబోతున్నాయి. వచ్చే మోడల్స్.. వాటి స్పెషాలిటీస్ మీద ప్రత్యేక కథనం
జైస్ కెమెరా ఫ్లాగ్ షిప్ లో వివో ఎక్స్ 500, వివో ఎక్స్ 500 ప్రో, వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ 20 వంటి మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇవి భిన్నమైన రంగులతోపాటు.. రకరకాల యాక్ససరీలను కలిగి ఉన్నాయి.. సెప్టెంబర్ 21 నుంచి జైస్ కెమెరా ఫ్లాగ్ షిప్ ఫోన్లను వివో విడుదల చేయబోతోంది. ఇండియన్ మార్కెట్ గురించి తెలియదు గానీ.. చైనాలో అయితే వివో ఎక్స్ 500 సిరీస్ ఫోన్ లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఆ కంపెనీ కల్పించింది.
వివో ఎక్స్ 500 టెలి కన్వర్టర్
నలుపు, తెలుపు రంగులోని బేస్ మోడల్స్ తో పాటు.. అప్ గ్రేడ్ చేసిన వివో ఎక్స్ 500 తిరుగులేని ఫీచర్లను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాక్సెసరీలలో ప్రొటెక్టివ్ కేస్, టెలి కన్వర్టర్ ఇందులో ఉన్నాయి. చైనా మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది యూరప్.. ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో ఎక్స్ 500 ప్రో మాక్స్
ఇది వివోలో అతిపెద్ద మోడల్. ఆధునికరించిన కెమెరాతో ఇది విడుదల కాబోతోంది. ప్రధానంగా కెమెరా కోసం మూడు డిగ్రీల ఓఐఎస్ ను కలిగి ఉన్నది. ఇది సిఐపిఏ 7 స్టెబిలైజేషన్ రేటింగ్ ను కలిగి ఉన్నది. వివో ఎక్స్ 500 మాదిరిగానే ఇది కూడా ఆ స్థాయి రంగులలో లభ్యమవుతుంది.
వివో x500 ప్రో మాక్స్
ఇందులో రెండు టెలీ కన్వర్టర్లు ఉన్నాయి. ఒకటి 200 మిల్లీమీటర్ వెర్షన్.. ఇంకొకటి 400 మిల్లీమీటర్ వెర్షన్.. లెన్స్ రింగ్ ను ప్రధాన కెమెరాకు స్క్రూ చేయవచ్చు. అదేవిధంగా రెండు టెలిఫోటో ఎక్స్ టెండర్లను రింగుకు జత చేయవచ్చు. తద్వారా ఈ గ్రిప్ ఫోన్ మొత్తాన్ని కెమెరాగా మార్చుతుంది. అదనపు బ్యాటరీ గా కూడా పనిచేస్తుంది
ఇప్పటివరకు వివో x300 అల్ట్రా బండి పరికరాలతో అందించే యాక్సెసరీ ప్యాకేజీకి దీనికి మధ్య ఎటువంటి తేడా కనిపించడం లేదు. అయితే ఈసారి కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే.. 1,180 ఎం ఏ హెచ్ బ్యాటరీతో అత్యంత సన్నని 5.65 ఎంఎం, 3.92 అంగుళాల టచ్ స్క్రీన్ ను పొందుపరిచారు. ఇది వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ వెనుక భాగంలో అయస్కాంతం ద్వారా అంటుకుంటుంది. ఒకవేళ పది మీటర్ల దూరం నుంచి దీనిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ప్రధాన కెమెరా కోసం సెల్ఫీ మానిటర్ లేదా రిమోట్ కంట్రోల్ గా ఉపయోగించవచ్చు. ఈ పరికరాలు థర్డ్ పార్టీ తయారీదారుల వద్ద కూడా అందుబాటులో ఉంటాయి.