Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: పాపం..ఆటో రామ్ ప్రసాద్ పరువు తీసేసిన నాగార్జున..అనవసరం గా 'బిగ్...

Bigg Boss 10 Telugu: పాపం..ఆటో రామ్ ప్రసాద్ పరువు తీసేసిన నాగార్జున..అనవసరం గా ‘బిగ్ బాస్ 10’ కి వచ్చాడు!

Bigg Boss 10 Telugu:  ‘జబర్దస్త్’ ద్వారా ఆటో రామ్ ప్రసాద్ ఎంతటి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జబర్దస్త్’ అనే షో ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన వారిలో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. ఆయనకు బిగ్ బాస్ 10 లోకి ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లో కమెడియన్ గా ఆ రేంజ్ లో స్థిరపడ్డాడు. […]

Bigg Boss 10 Telugu:  ‘జబర్దస్త్’ ద్వారా ఆటో రామ్ ప్రసాద్ ఎంతటి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జబర్దస్త్’ అనే షో ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన వారిలో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. ఆయనకు బిగ్ బాస్ 10 లోకి ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లో కమెడియన్ గా ఆ రేంజ్ లో స్థిరపడ్డాడు. అయినప్పటికీ బిగ్ బాస్ అనుభవం పొందేందుకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన ఆడుతున్న తీరు ని చూస్తుంటే కమెడియన్స్ క్యాటగిరీలో ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ లోకి వచ్చిన అందరి కంటెస్టెంట్స్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. సాధారణంగా కమెడియన్స్ మాస్కులు పెట్టుకొని తిరుగుతుంటారు. కానీ రామ్ ప్రసాద్ మాస్క్ పీకేసాడు, తన మనసుకి ఏది నచ్చితే అది చేస్తున్నాడు. ఇది ఆడియన్స్ కి బాగా నచ్చింది.

అయితే రామ్ ప్రసాద్ కి ఇండస్ట్రీ ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం , ఆయన వేసే ఆటో పంచులే. అదే పంచులు నేడు ‘బిగ్ బాస్’ హౌస్ లో ఆయన పరువు కూడా తీసింది. ఈయన షాలిని పై వేసిన అసభ్యకరమైన జోకు పై నేడు నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు అట. రామ్ ప్రసాద్ సిగ్గుతో తలదించుకుని షాలిని కి క్షమాపణలు కూడా చెప్పాడట. కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని తన కామెడీ తో సంపాదించుకున్న రామ్ ప్రసాద్ పరువు , ఒక చిన్న జోకు కారణంగా పోవడం ఆయన అభిమానులకు బాధని కలిగిస్తోంది. ఇంతకాలం తన కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న రామ్ ప్రసాద్ , ఈ ఒక్క బ్యాడ్ జోక్ కారణంగా నెగెటివ్ మార్క్ ని వేసుకున్నాడు.

దీన్ని చూసిన నెటిజెన్స్, అనవసరంగా ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు , కావాలని ఉద్దేశపూర్వకంగా , కించపరిచే విధంగా రామ్ ప్రసాద్ అలా చేసి ఉండదు , కానీ ఎలాంటి అంశాలపై జోకులు వెయ్యాలి , ఎలాంటి అంశాలపై జోకులు వేయకూడదు అనే అంశాల మధ్య చిన్న గీత ఒకటి ఉంటుంది. ఆ గీత ని ఎప్పుడు దాటకూడదు. దాటితే పరువు పోతుంది అనేది ఆయనకు ఈ సంఘటన ద్వారా అర్థం అయ్యే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. షాలిని కాబట్టి అర్థం చేసుకొని ఈ అంశంపై పెద్ద గొడవ చెయ్యలేదు , అదే వేరే లేడీ కంటెస్టెంట్ అయ్యుంటే రామ్ ప్రసాద్ పరువు ని గంగలో కలిపేవారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా నాగార్జున కోటింగ్ రామ్ ప్రసాద్ కి మంచే చేస్తుంది అని చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper