Homeఎంటర్టైన్మెంట్Uppal Balu: నవదీప్ మీ గు#@% మీరు మూసుకొని గమ్మునుండాలే.. 'అగ్నిపరీక్ష 2' లో అవమానంపై...

Uppal Balu: నవదీప్ మీ గు#@% మీరు మూసుకొని గమ్మునుండాలే.. ‘అగ్నిపరీక్ష 2’ లో అవమానంపై రెచ్చిపోయిన ఉప్పల్ బాలు

Uppal Balu: రేపటి నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లో ‘అగ్ని పరీక్ష 2’ షో టెలికాస్ట్ కాబోతున్న ఈ నేపథ్యం లో , ఎన్నో అప్డేట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చివరి రౌండ్ కి ఎంపికైన టాప్ 15 కంటెస్టెంట్స్ కి ‘అగ్ని పరీక్ష 1’ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ చేత టాస్కులు నిర్వహిస్తున్నారు. నిన్నటి […]

Uppal Balu: రేపటి నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లో ‘అగ్ని పరీక్ష 2’ షో టెలికాస్ట్ కాబోతున్న ఈ నేపథ్యం లో , ఎన్నో అప్డేట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చివరి రౌండ్ కి ఎంపికైన టాప్ 15 కంటెస్టెంట్స్ కి ‘అగ్ని పరీక్ష 1’ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ చేత టాస్కులు నిర్వహిస్తున్నారు. నిన్నటి షూటింగ్ లో ప్రియా శెట్టి , కళ్యాణ్ పడాల కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు నిర్వహించగా, నేడు జరగబోయే షూటింగ్ కి హరిత హరీష్ , డిమోన్ పవన్, దమ్ము శ్రీజ లు కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించబోతున్నారు. వీటిల్లో విన్నింగ్ శాతం ఎక్కువ ఉన్నవాళ్ళకి ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

అలా ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ‘అగ్నిపరీక్ష 2’ షో లో చాలా రాజకీయాలు జరిగాయని, సామాన్యులను అవమానించారనే టాక్ ఉంది. ముఖ్యంగా 8 మంది కంటెస్టెంట్స్ ని హోల్డ్ లో పెట్టి , వాళ్లకు ఎలాంటి టాస్కులు పెట్టకుండానే ఎలిమినేట్ చేసి పంపారట, ఇదెక్కడి న్యాయం అని అడిగితే, చాలా పొగరుతో సమాధానం చెప్పి , యాంకర్ శ్రీముఖి వాళ్ళని పంపేసిందట. దీని పై ఇప్పుడు సోషల్ మీడియా లోని నెటిజెన్స్ లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇకపోతే ఈ ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్ లో ఉప్పల్ బాలు కూడా పాల్గొన్నాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈయన్ని ఆడిషన్స్ లెవెల్ లోనే రిజెక్ట్ చేశారు జడ్జీలు. సాధారణంగా ఉప్పల్ బాలు ని సెలబ్రిటీ క్యాటగిరీ లో ఎంచుకుంటారని అంతా అనుకున్నారు.

ఎందుకంటే సోషల్ మీడియా ని ఉపయోగించే నెటిజెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు ఉప్పల్ బాలు. గత సీజన్ లో ఇమ్మానుయేల్ లాంటి టాప్ కంటెస్టెంట్ ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉప్పల్ బాలు ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసాడు. అంత ఫేమస్ ఆయన. అలాంటి వ్యక్తిని సెలబ్రిటీ క్యాటగిరీలో తీసుకోకపోగా, ఆడిషన్స్ లో కూడా రిజెక్ట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసిన అంశం. అంతే కాదు ఉప్పల్ బాలు ని జడ్జీ నవదీప్ చాలా దారుణంగా అవమానించాడట. వల్గర్ వీడియోలు తప్ప , నువ్వు చేసిందేంటి?, నీ వల్ల బిగ్ బాస్ కి ఎలాంటి ఉపయోగం లేదు అని తాను అనడమే కాకుండా , తన తోటి జడ్జీలను కూడా ప్రేరేపించాడట. తనకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ , ఉప్పల్ బాలు అప్లోడ్ చేసిన ఈ రెండు వీడియోలను మీరు కూడా చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper