Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై 5 వారాలు పూర్తి అయ్యింది. ఈ 5 వారాల్లో కంటెస్టెంట్స్ ఆట తీరుని బాగా గమనించి, ఆరవ వారం వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకు అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ నిన్న జరిగిన నామినేషన్స్ లో పాత కంటెస్టెంట్స్ ఆట తీరు గురించి జనాలు ఏమనుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. బిగ్ బాస్ హిస్టరీ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన పరోక్ష సూచనలను పరిగణలోకి తీసుకొని గేమ్ తీరుని మొత్తం మార్చుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అమర్ దీప్ మాత్రమే. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ప్రతీ ఒక్కరు నామినేట్ చేస్తూ వాళ్ళ ఆట తీరుపై స్పందించారు. తెలివైన వాళ్ళు ఎవరైనా వాటిని అంగీకరించి తమ ఆట తీరుని మార్చుకుంటారు. కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చెప్పే పాయింట్స్ ని అంగీకరించకుండా వితండ వాదన చేస్తున్నారు.
వీళ్ళను చూసిన తర్వాత ఎక్కడి నుండి ఈ సంతని పట్టుకొచ్చారు రా బాబు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ కి ఆడే సత్తా ఉన్నప్పటికీ, టైటిల్ గెలిచేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా గేమ్ ని సీరియస్ గా తీసుకోకుండా, ఎదో ఎంజాయ్ చేయడానికి బిగ్ బాస్ షో కి వచ్చినట్టుగా చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది. ఇదే విషయాన్నీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఆమెకి వివరిస్తూ నామినేట్ చేస్తారు. గంగవ్వ అయితే విష్ణు ప్రియ ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘2వ వారం వరకు బాగా ఆడేదానివి, మూడవ వారం నుండి అసలు ఆటలే ఆడడం లేదు. గమ్ముగా కూర్చొని ఉన్నావు. బిగ్ బాస్ కి మనం వచ్చింది ఆటలు ఆడేందుకు, ఈసారి బిగ్ బాస్ షోని జనాలు సరిగా చూడడం లేదు, మన బయట దేశాలలో ఈ షోని చూస్తేనే నాలుగు రూపాయిలు వస్తాయి, దాని వల్ల వాళ్ళు బ్రతుకుతారు, మనం బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆడడం లేదు, నీ కాళ్ళు చేతులు సక్కగా లేవా?, ఆడేందుకు ఏమిటి నీకు ఇబ్బంది’ అని అంటుంది.
గంగవ్వ మాట్లాడిన ఈ మాటలకు విష్ణు ప్రియ నోటి నుండి మాట పెగలలేదు. ఆ తర్వాత ఆమె ఎలాంటి కౌంటర్ ఇచ్చింది అనేది ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది. గంగవ్వ కాస్త బలంగానే చెప్పింది కానీ, విష్ణు ప్రియ కి ఆ మాత్రం కోటింగ్ పడాల్సిందే. ప్రతీ వారం నాగార్జున విష్ణు ప్రియ కి చేయాల్సిన డ్యూటీని గంగవ్వ చేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున ఇన్ని రోజులు విష్ణు ఆట తీరుని మార్చే ప్రయత్నమే చేయలేదు. ఆమె క్యూట్ గా మాట్లాడడం, నాగార్జున దానికి కరిగిపోయి ముచ్చట్లు ఆడడం దీనికే సరిపోయింది. ఒకవేళ నాగార్జున విష్ణు ప్రియ కి బాగా కోటింగ్ ఇచ్చి ఉండుంటే ఈపాటికి ఆమె తన ఆట తీరుని మార్చుకొని వేరే లెవెల్ కి వెళ్లి ఉండేది అని జనాల అభిప్రాయం.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More