Homeఎంటర్టైన్మెంట్CM YS Jagan : ఇక నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న మాజీ సీఎం...

CM YS Jagan : ఇక నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న మాజీ సీఎం వై ఎస్ జగన్..సంబరాల్లో వైసీపీ శ్రేణులు!

CM YS Jagan :  2019 సార్వత్రిక ఎన్నికలలో 175 కి 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని, ముఖ్య మంత్రి స్థానంలో కూర్చొని సంచలనం సృష్టించిన మాజీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సొంతం చేసుకోలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత దారుణమైన పరాజయం జగన్ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ పరాభవం ని తట్టుకోలేక ఆయన అసెంబ్లీ కి కూడా రాకుండా ఉంటున్న విషయాన్నీ మనమంతా గమనిస్తూనే ఉన్నాం. మొదటిరోజు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఆయన వచ్చాడు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం రోజున అతనితో పాటు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి పెద్ద రచ్చ చేసి వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్ని రోజులైనా అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ మొండికేసాడు జగన్.

రాజ్యాంగ బద్దంగా ప్రతిపక్ష హోదా దక్కాలంటే కచ్చితంగా 18 సీట్లు వచ్చి ఉండాలి, అందుకే ఆయనకీ ప్రతిపక్ష హోదా ని ఇచ్చేందుకు నిరాకరించారు అసెంబ్లీ స్పీకర్. అసెంబ్లీ లో తనకి మైక్ ఇవ్వరని, సమావేశాలు జరిగిన రోజున, ప్రతీ అంశానికి సమాధానం ఇస్తూ, నేను ప్రెస్ మీట్ ద్వారా మీ ముందుకొస్తానని జగన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ పార్టీ రోజురోజుకి ప్రజాక్షేత్రం లో బలహీన పడుతుంది. నాయకులందరూ చెల్లాచెదురు అయిపోతున్నారు. పార్టీ కి మొదటి నుండి పట్టుకొమ్మలు లాగా ఉంటూ వచ్చిన ఎంతో మంది ముఖ్య నాయకులూ వీడిపోతున్నారు. అసెంబ్లీ లో ప్రజా సమస్యలపై జగన్ గళం వినిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం పై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది. ఇదంతా గమనించిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఇక నుండి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

త్వరలో జరగబోయే శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాబోతున్నాడు. ప్రస్తుతం అసెంబ్లీ కి స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా రఘు రామ కృష్ణంరాజు ఉంటున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాలు మొత్తం రఘు రామ కృష్ణం రాజు అద్యక్షతనే జరిగింది. అసెంబ్లీ లో ప్రతిపక్షం లేక సమావేశాలు చూసేవారికి ఎంత బోర్ కొడుతున్నాయో మనమంతా చూసాము. చంద్రబాబు, జగన్ గతం లో ఎన్నోసార్లు అసెంబ్లీ వాదోపవాదనలు వేసుకున్న సందర్భాలు మనమంతా చూసాము. కానీ పవన్ కళ్యాణ్, జగన్ మధ్య వాదనలు ఇప్పటి వరకు చూడలేదు. వీళ్లిద్దరు కలిసి ఒకే వేదికని పంచుకోవడం ఇప్పటి వరకు జనాలు చూడలేదు. వీళ్లిద్దరు రఘు రామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగే సమావేశాలు, ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటే ఎలా ఉంటుందో అతి త్వరలోనే మనమంతా చూడబోతున్నాము. ఇక నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా ఫైర్ మీద ఉండబోతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper