Eshwar Sai Wife: కథనాలు ప్రసారం చేసిన మీడియా పిచ్చిది అయిపోయింది. విలేకరులు వెర్రి వాళ్ళు అయిపోయారు. చూసిన ప్రేక్షకులు పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈమె ఆడిన గేమ్ అటువంటిది. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కూడా అటువంటివే. అసలు ఇంత క్షమా గుణం ఉన్నప్పుడు ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం చేసినట్టు.. అది ఆమెకే తెలియాలి.
సరిగా రెండు రోజుల క్రితం వేములవాడలో యూట్యూబ్ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ రెడ్ హ్యాండెడ్ గా వేములవాడలో దొరికిపోయారు. వీరిద్దరిని ఈశ్వర్ సాయి భార్య పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరి చెంపలు వాయించింది. ఈ పరిణామంతో ఈశ్వర్ సాయి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. మాధురి రాథోడ్ కు దిమ్మ తిరిగిపోయింది. అప్పటికి ఈశ్వర్ సాయి భార్య ఆగలేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇద్దరిని పట్టించింది. ఆ తర్వాత మీడియాలో.. సోషల్ మీడియాలో ఇద్దరి గురించి ఒకటే చర్చ. మీడియాలో డిబేట్ లు కూడా ప్రసారమయ్యాయి. కొందరు మాధురి రాథోడ్ ను సపోర్ట్ చేశారు. మరికొందరు ఈశ్వర్ సాయి భార్యకు అండగా నిలిచారు.
ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ కు ఈశ్వర్ సాయి భార్య అండగా నిలిచింది. తాజాగా ఒక వీడియో ద్వారా ఆమె సంచలన ప్రకటన చేసింది. “మీడియాకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయండి. వాళ్లకి కెరియర్లు ఉన్నాయి. వారిద్దరూ యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు. పాటల ద్వారా గుర్తింపు సాధించారు. వారి విషయంలో మీడియా కాస్త అత్యుత్సాహాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ప్రసారం చేసిన వీడియోలను.. వార్తలను డిలీట్ చేయండి. ఎందుకంటే కాస్త వాళ్లకు కూడా ప్రైవసీ కావాలి కదా. ఇదంతా జరిగిన తర్వాత రకరకాల చర్చలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇచ్చే స్థితిలో నేను లేను. నేను మాట్లాడిన ఈ మాటలను గౌరవంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయాలని” ఈశ్వర్ సాయి భార్య ఆ వీడియోలో పేర్కొంది.
ఈ వీడియో పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతటి ఓపిక ఉన్న దానివి వారిద్దరిని ఎందుకు పట్టుకున్నావ్.. ఎందుకు ఆ స్థాయిలో మీడియాను వెంట తీసుకెళ్లావ్.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావు.. చివరికి ఇలా ఎందుకు చేశావు.. దీనివల్ల నీకు జరిగిన ప్రయోజనమేంటి.. ఇది జరిగిన తర్వాత నువ్వు కుదుర్చుకున్న సెటిల్మెంట్ ఏంటి.. నీ అవసరం తీరిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడతావా.. అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram