spot_img
Homeఎంటర్టైన్మెంట్అతిలోక సుందరి కూతురు దిల్ రాజు నిర్మాణంలో !

అతిలోక సుందరి కూతురు దిల్ రాజు నిర్మాణంలో !

Khushi Kapoor Movie

అతిలోక సుందరి, అలనాటి అందాల తార అంటూ ‘శ్రీదేవి’ గురించి ఎన్ని చెప్పుకున్నా.. ఆమె అందం గురించి పూర్తిగా వర్ణించలేం. ప్రస్తుతం శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె వారసత్వం మాత్రం ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడబోతోంది. ఇప్పటికే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌ గా ఫుల్ బిజీగా ఉంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సినిమాలతో బిజీ అవ్వడానికి కసరత్తు చేస్తోంది.

ఇటివలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ను వెండితెరకి పరిచయం చేయాలని బోనీ కపూర్‌ ఆల్ రెడీ సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే టాలీవుడ్‌ లో ఖుషీ కపూర్ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. వాస్తవం ఎంత ఉందని పక్కన పడితే.. బోణి కపూర్ చిన్న కూతురును కూడా తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఖుషీ కపూర్‌ యాక్టింగ్‌ లో శిక్షణ కూడా తీసుకుంటుందట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఓ సినిమాలో ఖుషీ కపూర్‌ నటించనుంది. ‘శ్రీదేవి’కి ఒక చిరకాల కోరిక ఉంది. తన చిన్న కూతురిని పెద్ద హీరోయిన్ ను చేయాలని శ్రీదేవి ఎప్పుడు ఆశ పడుతూ ఉండేది. ఎలాగూ బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది జాన్వీ కపూర్.

జాన్వీ బాటలోనే ఖుషీ కపూర్ కూడా ఎంట్రీకి సిద్ధమైంది. అయితే ఈ యంగ్ బ్యూటీకి కొంచెం అందచందాలు తక్కువ కావడంతో, సర్జరీలు కూడా చేయించుకుని మరీ మొత్తానికి అందాన్ని పెంచుకుని హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మరి అక్క లాగే అరంగేట్రంలోనే ఖుషి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper