Homeఎంటర్టైన్మెంట్Rangasthalam Movie: సుకుమార్ రంగస్థలం లో ఆది కంటే ముందు ఆ హీరోని తీసుకోవాలనుకున్నాడా..?

Rangasthalam Movie: సుకుమార్ రంగస్థలం లో ఆది కంటే ముందు ఆ హీరోని తీసుకోవాలనుకున్నాడా..?

Rangasthalam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఈయన రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తనదైన రీతిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే విధంగా తను పోషించిన చిట్టిబాబు పాత్రకి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. తను కాకుండా ఆ క్యారెక్టర్ లో మరొకరిని మనం ఊహించుకోలేము, అంటే ఆయన ఆ పాత్రలో ఎంతలా లీనమైపోయి చేసి, చూసే ప్రేక్షకుడిని మెప్పించాడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర తర్వాత అంతటి ముఖ్య పాత్ర ఏదైనా ఉంది అంటే ఆది పినిశెట్టి చేసిన కుమార్ బాబు క్యారెక్టర్ అనే చెప్పాలి. అయితే ఆది పినిశెట్టి కంటే ముందే ఈ పాత్ర కోసం సుకుమార్ ఒక తమిళ హీరో ని అనుకున్నాడట ఆయన ఎవరు అంటే ఆర్య… అయితే కుమార్ బాబు పాత్రలో ముందుగా ఆర్య ని తీసుకుందామనుకున్నారు కానీ ఆర్య ఆపాత్రకు సెట్ అవ్వడు అని సుకుమార్ టీమ్ అంత గట్టిగా చెప్పడంతో సుకుమార్ కూడా తన మనసు మార్చుకున్నాడట, మరి ఎవరిని తీసుకుందాం అని అనుకుంటున్నప్పుడు, అప్పటికే సరైనోడు సినిమాలో విలన్ పాత్ర చేసి ఉన్న ఆది పినిశెట్టి అయితే బాగుంటాడని సినిమా యూనిట్ అందరూ బలంగా చెప్పడంతో సుకుమార్ కూడా అదే నిర్ణయాన్ని ఫాలో అవుతూ ఆ సినిమాలో ఆది పినిశెట్టిని తీసుకున్నాడు.

ఇక మొత్తానికైతే ఆయన పాత్ర కూడా సినిమాకి ప్రాణం లాంటిది. కాబట్టి ఆది పినిశెట్టి ఆ పాత్రలో నటిస్తుంటే సుకుమార్ కూడా అతన్ని సెట్ లోనే మెచ్చుకున్నాడట. ఇక ఆది ఆ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా చివర్లో ప్రేక్షకులందరి చేత కన్నీళ్లు కూడా పెట్టించాడు. ఇక మొత్తానికైతే ఆది పినిశెట్టి ఆ పాత్ర లో జీవించేశాడనే చెప్పాలి.

ఇక ఆది ఎంటైర్ కెరియర్ లో టాప్ ఫైవ్ క్యారెక్టర్ లను కనుక తీసుకున్నట్లయితే ఈ పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట కూడా ఆయన ఇలాంటి పాత్ర చేయలేడు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ పాత్రలో ఉన్న జీవం అలాంటిది. అలాగే తను నటించిన విధానం కూడా అంత గొప్పగా ఉంటుంది…

బాలయ్య , అల్లు అర్జున్.. ఇద్దరిలో బోయపాటి ఛాయిస్ ఎవరికి?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి అంశంలో కష్టాలు ఉంటాయి. ఇక సినిమా హీరోలకు, హీరోయిన్ లకు ఒక సినిమా చేస్తున్నప్పుడు మరొక సినిమా అవకాశం వస్తే డేట్స్ ఇవ్వాలి. సమయం లేకపోతే క్యాన్సల్ చేసుకోవాల్సిందే. వీరికి మాత్రమే కాదు డైరెక్టర్లకు కూడా ఇలాంటి తలనొప్పులు ఎక్కువగానే ఉంటాయి. కొన్ని సార్లు ఏ హీరోతో సినిమా తీయాలో అర్థం అవదు. ఇద్దరితో సినిమా తీయాలి అనుకున్నప్పుడు ముందు ఏ హీరోకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే అంశంతో తర్జన భర్జన అవుతుంటారు. ప్రస్తుతం బోయపాటి శీను కూడా అదే టెన్షన్ లో ఉన్నట్టుగా ఉన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించారు బోయపాటి శీను. ఈయన చాలా సినిమాలు హిట్ లను అందుకున్నాయి. దీంతో పెద్ద హీరోలు ఈయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈయన ఎవరితో సినిమా చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బాలయ్య, మరో వైపు అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరితో సినిమా అనే ప్రశ్న ఎదురవుతోందట. అయితే అల్లు అరవింద్ తన బ్యానర్ లో సినిమా చేయాలని బోయపాటిని కోరారట.

గీతా ఆర్ట్స్ అంటే కచ్చితంగా అల్లు అర్జున్ తోనే సినిమా ఉంటుంది. బన్నీ కూడా బోయపాటితోనే సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఎందుకంటే గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే త్రివిక్రమ్ ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి ఆయన మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. అందుకే సినిమా తీసి ఇబ్బందులు పడటం అవసరమా అనుకుంటున్నారని టాక్. ఒకరకంగా బోయపాటి కూడా స్కంద సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ పుష్ప సినిమాతో మంచి మాస్ క్రేజ్ సంపాదించారు అల్లు అర్జున్.

మరోసారి మాస్ డైరెక్షన్ లో సినిమా వస్తే మంచి హిట్ పడే అవకాశం ఉందని అల్లు అర్జున్ బోయపాటిని ప్రిఫర్ చేస్తున్నట్టు టాక్. ఇక బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో కూడా సినిమా రావాల్సి ఉంది. ఇప్పటికే అఖండ 2 సినిమా ఎప్పుడు వస్తుందంటూ తెగ ఎదురుచూస్తున్నారు వీరి అభిమానులు. బాలయ్య సినిమా అంటే హిట్ పక్కా ఉంటుంది. దీంతో అఖండ్ సీక్వెలా? లేదా ఫ్రెష్ లవ్ స్టోరీనా అని థింక్ చేస్తున్న సమయంలో ఇటు అల్లు అర్జున్, అటు బాలయ్య ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరితో బోయపాటి సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper