Shubman Gill: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుపై ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది అనడం కంటే భారత జట్టు చేజేతులా ఓడిపోయింది అనడం సబబు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టును 246 పరుగులకు ఆల్ అవుట్ చేసిన ఇండియా.. తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత జట్టు విజయం లాంచనం అనుకుంటున్న తరుణంలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో సత్తా చూపింది. ముఖ్యంగా పోప్ 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 420 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అంతే కాదు భారత జట్టు ఎదుట 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పటిష్టమైన బ్యాటింగ్ లేనప్ ఉన్న భారత జట్టు ఈ లక్ష్యాన్ని చేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ హార్ట్ లీ ఏకంగా ఏడు వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని శాసించాడు. అతడి ధాటికి భారత జట్టు రెండవ పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ విజయం నేపథ్యంలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందులో సంజయ్ మంజ్రేకర్ అనే రిటైర్డ్ బ్యాట్స్మెన్ ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన వ్యాఖ్యానం చర్చనీయాంశంగా మారింది.
“భారత జట్టులో గిల్ తిరుగులేని బ్యాట్స్మెన్. కానీ అతడు ఈ టెస్ట్ మ్యాచ్లో తేలిపోయాడు. ముఖ్యంగా అతడి ఫుట్ వర్క్ ఏమంత బాగోలేదు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆటగాడు మెరుగ్గా ఆడితేనే స్కోరు ముందుకు కదులుతుంది. అదే మెరుగ్గా ఆడకుండా నిర్లక్ష్యపు షాట్లు ఆడితే అది జట్టుపై ప్రభావం చూపిస్తుంది..ఫుట్ వర్క్ సరిగా లేకుంటే అందుకు తగ్గట్టుగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో పోప్ ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 196 పరుగులు చేశాడు. అతడి ఆటతీరుతో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 420 పరుగులు చేసింది. అంతేకాదు బౌలింగ్ లోనూ విజృంభించి భారత జట్టును 2002 పరుగులకు ఆల్ అవుట్ చేసి 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో పోప్ కీలకపాత్ర పోషించాడు. అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కు అన్ని విధాలుగా అర్హుడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన పోప్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకున్నాడు. అదే భారత జట్టులో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన గిల్ మాత్రం గోల్డెన్ డక్ ఔట్ గా వెను తిరిగాడు. అతడు కూడా పోప్ లాగా ఆడి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది..గిల్ ఫుట్ ఫుట్ వర్క్ ఈ మ్యాచ్లో బాగోలేదు. ముఖ్యంగా ముందుకు వచ్చి ఆడటంలో అతడు. పోప్ ను చూసి నేర్చుకోవాలి. ఓపెనర్లు విఫలమైనప్పుడు లేదా స్వల్ప స్కోర్లకే వెను తిరిగినప్పుడు జట్టు భారం మొత్తం వన్ డౌన్ బ్యాట్స్మెన్ మీద పడుతుంది. అలాంటప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.. కానీ భారత రెండవ ఇన్నింగ్స్ లో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన గిల్ ఆ బాధ్యతను చేపట్ట లేకపోయాడని” సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. “పుణె లో కెవిన్ పీటర్సన్, ముంబై వాంఖడే లో స్టీవ్ స్మిత్, హైదరాబాదులో పోప్.. చేసిన సెంచరీలు అత్యంత అత్యుత్తమమైనవని”.. సంజయ్ అభిప్రాయపడ్డాడు.. కాగా ప్రస్తుతం సంజయ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
“భారత జట్టులో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా ఈ మ్యాచ్ లో గిల్ వచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండి ఉంటే భారత జట్టు భారీ స్కోరు సాధించేది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుకు ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేది. ఇక ఇంగ్లాండ్ తోని ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో పోప్ ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసిన ఇండియా.. ఇంగ్లాండ్ పై 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు.. ఓపెనర్లు క్రాలే, డకెట్ సుబారంబాన్ని అందించారు. స్వల్ప స్కోర్ వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో ఇక ఇంగ్లాండ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో వచ్చిన పోప్ చెలరేగి ఆడాడు. ఏకంగా 196 పరుగులు చేశాడు. నాలుగు పరుగుల దూరంలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. మొత్తానికి పోప్ దాటికి ఇంగ్లాండ్ ఏకంగా 420 పరుగులు చేసింది. పోప్ బ్యాటింగ్లో అదరగొడితే..హార్ట్ లీ బంతితో విజృంభించాడు. ఏకంగా 7 వికెట్లు తీసి భారత జట్టును 202 పరుగులకు ఆల్ అవుట్ చేశాడు. దీంతో 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.” అని సంజయ్ వ్యాఖ్యానాలతో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు భారత జట్టు ఓటమి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు..