Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga Spirit: 'స్పిరిట్' మూవీని సూపర్ హిట్ చేస్తానని సందీప్ రెడ్డి వంగ...

Sandeep Reddy Vanga Spirit: ‘స్పిరిట్’ మూవీని సూపర్ హిట్ చేస్తానని సందీప్ రెడ్డి వంగ ఆ నటుడితో మాట ఇచ్చాడా..

Sandeep Reddy Vanga Spirit: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీతో ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడే […]

Sandeep Reddy Vanga Spirit: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీతో ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడే ప్రభాస్ కెరియర్ లోనే ఈ మూవీని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుపుతానని సందీప్ ప్రామిస్ చేశారట. దానికి తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టినప్పటికి ఈ సినిమాతో అటు ప్రభాస్ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతే సందీప్ రెడ్డివంగా కూడా నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ కట్టబెడతానని ప్రభాస్ కి సందీప్ రెడ్డి వంగ మాట ఇచ్చాడట. మరి ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ప్రభాస్ సైతం సందీప్ ఇచ్చిన మాటకు చాలా ఇంప్రెస్ అయ్యారట. ఎందుకంటే సందీప్ గత సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే విధంగా ఉన్నాయి.

కాబట్టి ఈ సినిమాతో కూడా ఆయన అదే రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ప్రభాస్ సైతం కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి.

ప్రభాస్ అలాంటి సీన్లను చేస్తే అతని అభిమానులు కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఒప్పుకోరు. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా చెప్పినట్టుగానే ప్రభాస్ ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాల్లో నటించబోతున్నాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper