Telangana Congress: లండన్ పర్యటన ముగించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు.శంషాబాద్ విమనాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రేవంత్ ఏం మాట్లాడబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సురేఖ వ్యవహారం, అమెరికా వెళ్లడానికి కేంద్ర విదేశాంగ శాఖ మోకాలడ్డటం వంటి పరిణామాలపై రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతరనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశానికంటే ముందే తెలంగాణ రాజకీయాలలో సంచలన పరిణామాలు చోటు చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని సోషల్ మీడియా గ్రూపులు.. ముఖ్యంగా ఎక్స్ హ్యాండిల్స్ లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 20 మంది ఎమ్మెల్యేలతో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయ.. ఇవి చర్చనీయాశంగా మారిపోయారని.. మొయినాబాదులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యారని ప్రచారంలో ఉంది.
ఈ సమావేశంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద.. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు సాగిస్తున్న ఆధిపత్యం మీద తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినప్పటికీ.. తమ ధోరణి మార్చుకునే అవకాశం లేదని వారు చెప్పినట్టు గులాబీ పార్టీ సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం జరుగుతోంది.
మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి కొంతమంది సీనియర్ మంత్రులు సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి.. ముఖ్యమంత్రి సొంత జిల్లా చెందిన ఒక మంత్రి.. రంగారెడ్డి.. నల్గొండ జిల్లాలకు చెందిన కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు.. ఉమ్మడి పాలమూరు జిల్లా చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నట్టు గులాబీ పార్టీ సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒకవేళ ఆ 20 మంది ఎమ్మెల్యేలు తాటి మీదికి వస్తే.. రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. కెసిఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని గులాబీ పార్టీ సోషల్ మీడియా గ్రూపులో సొంత డబ్బా కొట్టుకుంటున్నాయి
ఇక ఇటీవల రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఆయన అమెరికా టూర్ రద్దయింది. గడ్డం నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ వచ్చారు. దీనిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సరే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన టూర్లో ఆకస్మికంగా మార్పులు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పరిణామాలు కూడా దీనికి కారణమని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణ కూడా వాయిదా పడుతూ వస్తోంది. మినిస్టర్ పదవులు ఆశిస్తున్న కొంతమంది సీనియర్ లీడర్లు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సమావేశం లో నిజం ఎంత.. దీని వెనక గులాబీ పార్టీ సోషల్ మీడియా ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం చేస్తోంది.. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా.. అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.