Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran: 'ఢీ 21' నుండి అనుపమ పరమేశ్వరన్ అవుట్.. కారణం ఏంటంటే!

Anupama Parameswaran: ‘ఢీ 21’ నుండి అనుపమ పరమేశ్వరన్ అవుట్.. కారణం ఏంటంటే!

Anupama Parameswaran: రీసెంట్ గానే మొదలైన ఢీ 21 షో కి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ మొదటి ఎపిసోడ్ నుండే పోటాపోటీగా డ్యాన్స్ లు వేస్తూ అదరగొడుతున్నారు. ఇకపోతే ఈ సీజన్ కి జడ్జీలుగా అనుపమ పరమేశ్వరన్ , జానీ మాస్టర్ లు వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ ప్రోమోలను బట్టీ చూస్తే ఈ షో నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు […]

Anupama Parameswaran: రీసెంట్ గానే మొదలైన ఢీ 21 షో కి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ మొదటి ఎపిసోడ్ నుండే పోటాపోటీగా డ్యాన్స్ లు వేస్తూ అదరగొడుతున్నారు. ఇకపోతే ఈ సీజన్ కి జడ్జీలుగా అనుపమ పరమేశ్వరన్ , జానీ మాస్టర్ లు వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ ప్రోమోలను బట్టీ చూస్తే ఈ షో నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు బదులుగా గత సీజన్ లో జడ్జీ గా వ్యవహరించిన రెజినా కాసాండ్రా కనిపించింది. అయితే కేవలం ఒక్క వారం ఎపిసోడ్ కి మాత్రమే అనుపమ పరమేశ్వరన్ డుమ్మా కొట్టిందని , ఆమె స్థానం లోకి రెజినా కాసాండ్రా ఆ ఒక్క వారం కోసం వచ్చిందని అంతా అనుకున్నారు.

కానీ లేటెస్ట్ గా రెజీనా ఇన్ స్టాగ్రామ్ తదుపరి ఎపిసోడ్ షూటింగ్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. దీంతో ఈమె ఆ షో నుండి తప్పుకున్నట్టు స్పష్టంగా ఖరారైంది. అనుపమ అకస్మాత్తుగా ఈ షో నుండి తప్పుకోవడం తో , అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశపడ్డారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అనుపమ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఆమె కోసమే ఈ షో ని చూసే యూత్ ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈమె ఈ షో నుండి తప్పుకోవడం నిరాశకు గురి అవుతున్నారు. వరుస సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల, డేట్స్ క్లాష్ రావడం తో అనుపమ ఈ షో నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెమ్యూనరేషన్ క్లాష్ కారణంగా ఆమె తప్పుకుందని మరోవైపు నుండి వార్తలు వినిపిస్తున్నాయి , ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాల్సి ఉంది.

ఇకపోతే రీసెంట్ గానే ఆమె ‘క్రేజీ కళ్యాణం’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, మంచి రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. కానీ ‘జైలర్ 2’ మేనియా కారణంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ , సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భోగి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. గతం లో ఈమె శర్వానంద్ తో కలిసి చేసిన ‘శతమానం భవతి’ అనే చిత్రం ఎంతటి కమర్షియల్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper